Telugu News

గ్రామాల్లో బిఆర్ఎస్ విస్తృత ప్రచారం

మదన్ లాల్ గెలుపు తథ్యం

0

గ్రామాల్లో బిఆర్ఎస్ విస్తృత ప్రచారం

== మదన్ లాల్ గెలుపు తథ్యం

ఏన్కూరు, అక్టోబర్ 30(విజయం న్యూస్):

 

బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గెలుపును కాంక్షిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు మండల వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు. సోమవారం మండల పరిధిలోని ఏన్కూరు, టిఎల్ పేట, గార్లఒడ్డు, హిమాంనగర్, రేపల్లెవాడ, గంగుల నాచారం గ్రామాల్లో స్థానిక సర్పంచులు, నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేద్దాం-మదన్ లాల్ ను గెలిపిద్దాం అంటూ ఇంటింటికి తిరుగుతూ, గోడ పత్రికలు అంటిస్తూ ఓటర్లను వేడుకున్నారు. బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనిఫెస్టోను ఓటర్లకు వివరించారు.

ఇది కూడా చదవండి:- నాది స్వరజన మతం.. నేను అందరి వాడను:మంత్రి పువ్వాడ 

కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందాయని, అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు. మదన్ లాల్ ను గెలిపించి, కేసిఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. నాచారంలో దిశా కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలోని దుకాణాల వద్ద ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బాధావత్ బుజ్జి, పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్, ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వర్లు, యండ్రాతి మోహన్ రావు, భూక్య బాలాజీ, మాదినేని అశోక్, పొన్నం హరికృష్ణ, చీటి కోటేశ్వరరావు, ముదిగొండ నాగేశ్వరరావు, ఏరువ నవీన్, పిల్లలమరి రాంబాబు, పూర్ణకంటి నాగరాజు, అజ్మీరా రైలు, షేక్ నజీర్, వేణు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:-;పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికే బైక్ యాత్ర:మంత్రి