Telugu News

కరెంట్ షాక్ తో భార్య, భర్తలు మృతి.

** తీగపై బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్ ** ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో మృతి.

0

కరెంట్ షాక్ తో భార్య, భర్తలు మృతి.

** తీగపై బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్
** ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో మృతి.

(మహుబూబాబాద్ – విజయం న్యూస్):-

కరెంట్ షాక్ తో ఇద్దరు భార్యభర్తలు మృతిచెందిన సంఘటన మహుబూబాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగింది.. స్నానం చేసిన భర్త తీగపై బట్టలు తీస్తుండగా విద్యుత్ షాక్ రావడంతో పక్కనే ఉన్న భార్య కూడా అతన్ని పట్టుకుంది. దీంతో ఇద్దరు కరెంట్ షాక్ తో అస్వస్థతకు గురై కిందపడ్డారు. దీంతో బందువులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు బందువులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహబూబాద్ జిల్లా, బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ లో సింగారం SCకాలనీలో అనపర్తి ఉపేందర్(32), భార్య తిరుపతమ్మ(27) జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు శ్యామల ( 8) బిందు( 6 ) ఉన్నారు. ప్రతిరోజు లాగే శుక్రవారం రాత్రి భర్త స్నానం చేసి తాడులాంటీ తీగపై ఆరేసిన బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్ వచ్చింది. దీంతో భర్త కొట్టుకుంటుండగా భార్య పోయి పట్టుకోవడంతో ఇద్దరికి కరేంట్ వచ్చింది. వల్ల భార్య భర్తకు అపస్మారక స్థితిలో ఉండగా వారి ఇద్దరి నీ ఆటోలో తరలించ్చగా మార్గమధ్యలో మృతి చెందారు. వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

 

also read :-గర్జించిన 24 గంటలలోపే..