Telugu News

వనజీవి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి పువ్వాడ..

= ఘనంగా పువ్వాడ సతిమణి పుట్టిన రోజు వేడుకలు

0

వనజీవి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి పువ్వాడ..
== ఘనంగా పువ్వాడ సతిమణి పుట్టిన రోజు వేడుకలు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఇటీవలే అస్వస్థతకు గురై కోలుకున్న పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతుల ఆరోగ్య పరిస్థితులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరితహారం, మొక్కలపై కాసేపు ముచ్చటించారు. అనంతరం కుమ్మరి సంఘం రూపిందించిన 2022-క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

== సంబరంగా మంత్రి పువ్వాడ సతీమణి వసంతలక్ష్మీ పుట్టినరోజు వేడుకలు..
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సతీమణి శ్రీమతి పువ్వాడ వసంత లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా మహిళ కార్పొరేటర్ ల ఆద్వర్యంలో వారి నివాసంలో సంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లు మంత్రి పువ్వాడ దంపతులచే కేక్ కట్ చేయించి వసంతలక్ష్మికి శాలువతో సత్కరించి, పుష్పగుఛ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు

also read :-నీ పాలనపై చర్చకు సిద్దమా..? కేసీఆర్‌కు తరుణ్‌ చుగ్‌ సవాల్‌