Telugu News

రైల్వే లైన్ ను అడ్డుకుంటా!: నామా 

హైదరాబాద్ లో ఎంపీ నామ నాగేశ్వరరావు ను కలసిన డోర్నకల్ -, మిర్యాలగూడ రైల్వే లైన్ బాధిత గ్రామాల రైతులు

0

రైల్వే లైన్ ను అడ్డుకుంటా!: నామా 

== పార్లమెంట్ లో ప్రస్తావిస్తా!

== రైతులకు అండగా ఉంటా

== నేను రైతు పక్షమే

== జిల్లాలో రైల్వే లైన్ అనుమతిoచం

==  హైదరాబాద్ లో ఎంపీ నామ నాగేశ్వరరావు ను కలసిన డోర్నకల్ -, మిర్యాలగూడ రైల్వే లైన్ బాధిత గ్రామాల రైతులు

== రైతులకు నామ అభయం.. భరోసా

ఖమ్మం, జూలై 17(విజయంన్యూస్):

రైల్వే లైన్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి, నష్ట పరిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు రైల్వే అధికారులకు స్పష్టం చేశారు. కొత్తగా ప్రతిపాదించిన డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ బాధిత గ్రామాల రైతులు సోమవారం హైదరాబాద్ లో ఎంపీ నామ నాగేశ్వరరావు ను కలసి, తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ విలువైన భూములు గుండా వెళుతున్న ఈ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చేలా సంబందిత అధికారులపై వత్తిడి తీసుకురావాలని బాధిత రైతులు ఎంపీ నామను కోరారు.ఈ సందర్భంగా ఎంపీ నామ రైతులనుద్దేశించి మట్లాడుతూ ” నాకు నా ఖమ్మం జిల్లా రైతుల ప్రయోజనాలే ముఖ్యం.. వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించినా….నష్టం కలిగినా అది నాకు కలిగినట్లే బాధ పడతానని అన్నారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ పై భద్రాద్రి ఎమ్మెల్యే ఫిర్యాదు

డోర్నకల్ -, మిర్యాలగూడ రైల్వే లైన్ వల్ల  జిల్లా ప్రజలకు కలిగే ప్రయోజనం శూన్యం అన్నారు. అందువల్ల జిల్లా రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఎంత దూరమైనా వెళతానని నామ అన్నారు. కోట్ల విలువైన భూములు, స్థలాలు, పేదల ఇళ్ల మీదుగా వెళ్లే ఈ ప్రతిపాదిత రైలు మార్గాన్ని అడ్డుకుని తీరుతామని, నేను ఎల్లప్పుడూ రైతు పక్షమేనని నామ చెప్పారు.అధైర్యపడాల్సిన అవసరం లేదని, రైతులకు అండగా ఉంటానని నామ భరోసా ఇచ్చారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రైలు మార్గాన్ని ఖమ్మం జిల్లాలో అనుమతించే ప్రసక్తే లేదని అన్నారు. ఈ రైలు మార్గాన్ని జిల్లాతో సంబంధం లేకుండా  బయట నుంచి నిర్మించుకోవాలని ఇప్పటికే రైల్వే మంత్రికి, ఉన్నతాధికారులను కలసి తెలియ జేయడం జరిగిందని తెలిపారు. మళ్ళీ రైల్వే మంత్రిని కలసి పరిస్థితి వివరిస్తానని అన్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని లెవనెత్తుతానని రైతులకు అభయం  ఇచ్చారు.

తాను మొదటి నుంచి కూడా జిల్లాలో ఈ రైలు మార్గానికి వ్యతిరేకమని చెప్పారు. ఇటీవల జరిగిన దిశ కమిటీ  సమావేశంలో కూడా ఈ విషయమై సంబంధింత అధికారులను పిలిపించి, మాట్లాడడం జరిగిందని, ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా బయట నుంచి ఈ నూతన రైలు మార్గాన్ని నిర్మించుకోవచ్చని తాను ఆ సమావేశంలో రైల్వే అధికారులకు స్పష్టం చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు రైల్వే మంత్రితోను, సంబంధిత రైల్వే ఉన్నతాధికారులతోను ఈ విషయమై చర్చించడం జరిగిందని నామ చెప్పారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ నాయకత్వంలో అబ్బురపర్చే అభివృద్ధి: నామా

ఖమ్మం జిల్లా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఈ కొత్త రైల్వే లైన్ తమకు అవసరం లేదని తాను ఖరా ఖండిగా రైల్వే మంత్రికి మళ్లీ  స్పష్టం చేస్తానని అన్నారు. ఈ విషయంలో రైతులు, ప్రజలు చేసే ఎటువంటి అందోళనకైనా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారికి అండగా ఉంటానని ప్రజల అభీష్టమే తన అభిమతమని నామ నాగేశ్వరరావు వెల్లడించారు.ఇప్పటికే నాగార్జునసాగర్, పలు జాతీయ రహదారుల నిర్మాణానికి విలువైన భూములు కోల్పోయారని అన్నారు. మళ్లీ ఇప్పుడు ఉన్న భూములను కూడా వదులు కోవడానికి రైతులు సిద్ధంగా లేరని నామ అన్నారు.  నామను కలసిన ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాలకు చెందిన బాధిత రైతులతో పాటు  మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రావతి , నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్, రైతులు సాధిక్ అలీ, వల్లూరి పట్టాభి, గుర్రం అచ్చయ్య, పుచ్చకాయల సుధాకర్, కొట్టేకోల నాగేశ్వరరావు, కుర్రా వెంకన్న, తోకల ఉపేందర్, గిస్కా రామ్మూర్తి, రామగిరి వెంకన్న, తదితరులున్నారు.