Telugu News

తుమ్మలది టీఆర్ఎస్ రెబల్ కాదు..టీఆర్ఎస్సే

పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా : తుమ్మల

0

తుమ్మలది టీఆర్ఎస్ రెబల్ కాదు..టీఆర్ఎస్సే
== పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా : తుమ్మల
== వరసగా రెండవ రోజు తుమ్మల అనుచరుల సమావేశం
== మధిరలో సమావేశం.. భారీ ర్యాలీ..హాజరైన మాజీ మంత్రి
== సమావేశానికి హాజరైన పొంగులేటి వర్గీయులు
== జెండా లేకుండా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు
== ఆసక్తిగా మారిన ఖమ్మం గులాబీపార్టీ రాజకీయం
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
మధిర నియోజకవర్గ కేంద్రంలో మరో బలప్రదర్శన కనిపించింది.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం మధిరలో పర్యటించారు. ఓ నాయకుడి నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయన అనుచరులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. భారీ ర్యాలీ తీశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఏ ఒక్క కార్యకర్త చేతులో పార్టీ జెండా లేకపోవడం గమనర్హం.
టీఆర్ఎస్ గుమ్మం, ఖమ్మంలో వర్గపోరు రోజురోజుకు మరింత జఠిలమవుతోంది..

also read :-వందకోట్ల క్లబ్‌లో చేరిన గంగూబాయి

ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనా వేస్తున్న ప్రధాన నాయకత్వం ఎన్నికల ప్రక్రీయను ప్రారంభించారు. అందులో భాగంగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయా మండలాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు.. గ్రామాల్లో నాయకులను పరామర్శిస్తు, అప్యాయతను కనబర్చుతున్నారు.. కాగా వాళ్ల అనుచరులు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.. శుక్రవారం పాలేరు నియోజకవర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు, అనుచరులు అత్యవసర సమావేశం నిర్వహించగా, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కలవాల్సిన అవసరం ఎంతైన ఉందని నిర్ణయించారు.

also read:-రాష్ట్రంలో అందుబాటులో 9,057 ఆర్టీసీ బ‌స్సులు : మంత్రి

అంతే కాకుండా కచ్చితంగా తుమ్మల పోటీ చేయాల్సిందేని స్పష్టం చేశారు. దీంతో జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయమైన ఈ సంఘటనతో కారు పార్టీ పెద్దలు ఖంగుతిన్నారనే అనుకోవాలి. ఇదిలా ఉంటే శనివారం మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు, అనుచరులు పెద్ద సంఖ్యలో అత్యవసరంగా సమావేశమైయ్యారు. భారీ ర్యాలీగా సమావేశానికి వచ్చారు. కాగా ఈ సమావేశానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరైయ్యారు. ఈ సందర్భంగా సుమారు రెండుగంటల పాటు కార్యకర్తలతో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. కాగా ఈ సమావేశానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు, ఆయన వర్గీయులు హాజరుకావడం గమనర్హం.
== పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తా: తుమ్మల
టీఆర్ఎస్ పార్టీ అదిష్టానం పోటీ చేసే అవకాశం కల్పిస్తే కచ్చితంగా పోటీ చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మధిరలో పర్యటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ మారే ప్రసక్తే లేదని, పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేయబోనని స్పష్టం చేశారు. పార్టీ అదేశిస్తే కచ్చితంగా పోటీ చేయమని చెబితే తప్పకుండా పోటీ చేస్తానన్నారు. ఇటీవలే చాలా ప్రచారాలు వస్తున్నాయని తుమ్మల టీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేస్తారా..?

అంటూ వచ్చే ప్రశ్నలను ఆయన తీవ్రంగా ఖండించారు. తుమ్మల నాగేశ్వరరావుది టీఆర్ఎస్ రెబల్ కాదని, టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు మా అబిమానులను పిలవడం లేదని, అవమానాలకు గురి చేస్తున్నారనే విషయాన్ని నాకు చాలా చార్లు చెప్పారని, ఈ విషయాన్ని అదిష్టానం ద్రుష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని, రాజకీయ విలువలను ఎవరు పాటించడం లేదన్నారు. గత పదేళ్ల క్రితం ఎన్నో విలువలతో కూడిన రాజకీయాలు చేసేవాళ్లమని, ఇప్పుడు రాజకీయ విలువలను దిగజార్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికి తను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎవరు అదైర్యపడోద్దని, కచ్చితంగా అందరికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.