Telugu News

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: రాహుల్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఖాయం: రాహుల్

0

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: రాహుల్

== తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఖాయం: రాహుల్

తుక్కగూడలో రాహుల్ వ్యాఖ్యలు ఈ కింద విధంగా

(హైదరాబాద్- విజయంన్యూస్)

తెలంగాణంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కొట్లాడటం లేదు..

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం లపై కాంగ్రెస్ పోరాటం చేస్తున్నాము

వేరువేరు పార్టీలుగా కనిపిస్తాయి.. కానీ ఆ మూడు పార్టీలు ఆత్మ ఒక్కటే

నేను పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను..

పార్లమెంట్ లో బీజేపీకి అవసరం ఉన్నప్పుడల్లా మద్దతు పలికారు

నరేంద్ర మోడీ మోడీ వెంట బీఆర్ఎస్ ఎంపీలు నడుస్తున్నారు

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, జీఎస్టీ కి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది

ఎప్పుడు బీజేపీకి అవసరం పడితే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు గా నిలబడతారు.

ఈ రోజు మన మీటింగ్ రోజున ముగ్గురికి ముగ్గురు మీటింగ్ పెట్టుకున్నారు

మనల్ని డిస్టబ్  చేయాలని ప్రయత్నం చేశారు

కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.. ఏ శక్తి కాంగ్రెస్ ను అడ్డుకోలేదు

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది..కాంగ్రెస్ కు ఓటు వేయాలి

ఇంకో విషయం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

ప్రతిపక్షాల నాయకులపై ఏదో ఒక కేసు ఉంది

ఈడీ, సీబీఐ, ఇన్ కమ్ ట్యాక్స్ ఇలాంటి అనేక శాఖలతో ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టారు

తెలంగాణ సీఎంపై ఒక్క కేసు లేదు. ఎంఐఎం నాయకులపై ఎలాంటి కేసులేదు

కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసు పెట్టారు.

నరేంద్రమోడీ ముఖ్యమంత్రి కేసీఆర్, అసదుద్దిన్ పై కేసులు లేవు..

అవినీతిలో తెలంగాణ ప్రభుత్వం కూరకపోయిన ఎలాంటి కేసులు ఉండవు

ఈ రోజు సోనియా గాంధీ స్వీచ్ వింటున్నాను.

సోనియాగాంధీ మాట ఇస్తే నిలబెట్టుకుంటారు

ఎంత కష్టమొచ్చిన సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు

2012లో సోనియగాంధీ తెలంగాణ రాష్ట్ర విషయంలో ఆలోచిస్తున్నామని తెలిపారు

ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సోనియాగాంధీ చాలా ప్రయత్నం చేశారు

బలం లేకపోయినప్పటికి మీ అకాంక్ష ,ప్రజల కలను నేరవేర్చిన ఘనత సోనియాగాంధీదే

బీజేపీ, బీఆర్ఎస్

అన్ని లాభాలు ముఖ్యమంత్రి కుటుంబానికి చెందుతాయి

మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం కోసం కాదు..

కేసీఆర్ కుటుంబ లాభాల కోసం చేయలేదు..

తెలంగాణ ప్రజలు, కిసాన్, ప్రజలు, కార్మికుల కోసం, బలహీన వర్గాలు, మహిళల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశాం

గత తొమ్మిదిన్నర ఏళ్లలో చిన్నచిన్న వ్యాపారుల, మైనార్టీలకు, రైతులకు ఎవరికి న్యాయం జరగలేదు.

మేము తెలంగాణ ఇస్తామని మాటిచ్చినం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ

అతి కొద్ది సమయంలోనే బీఆర్ఎస్ ను తరిమికొట్టి పడతాం

ఎవరు ఆపలేరు..

ఈ ప్రభుత్వం మారబోతుంది.. బీజేపీ, ఎంఐఎం రక్షించుకున్న తెలంగాణ ప్రజలు తరిమికొట్టబోతున్నరు

తెలంగాణ గ్యారంటీ ఇచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినం

ఆరు గ్యారంటీ ఇచ్చినం

రూ.5లక్షలతో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం

ఇండ్లు లేని వారందరికి ఇండ్లను మంజూరు చేస్తాం

250 గజాలు తెలంగాణ ఉద్యమకారులకు, పోరాటం చేసిన వారికి ఇండ్ల స్థలం, ఇళ్లు ఇస్తాం

రెండవ పథకం మహాలక్షి పథకాన్ని సోనియా గాంధీ ప్రకటించారు.

ప్రతి మహిళలకు నెలకు 2500 ఇవ్వబోతున్నాము

రూ.500లకే సిలిండర్ మంజూరు చేస్తాం

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన విధంగా మహిలళకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం చేస్తాం

వాళ్లు మాకు చెప్పారు మాజీవితాలు మార్చేశారని

తెలంగాణ లో కూడా మహిళలందరికి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం

మూడవ హామి

200 యూనిట్ల ఉచిత కరెంట్ అందరికి ఇస్తాం

 

రూ.5లక్షల యువకులకు  కోచింగ్ ఫీజు అంతా కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుంది.

నెలకు 4వేల పెంచన్లు చేయబోతున్నాము

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కిందా 10లక్షల మంజూరు చేస్తాం

రైతు భరోసా పథకం కిందా ఏడాదికి ప్రతి ఎకరానికి రూ.15వేల, రైతు కూలీలకు రూ.12వేలు ఇవ్వబోతున్నాం

కర్నాటకలో నరేంద్రమోడీ కాంగ్రెస్ పట్ల ఎద్దేవా చేశారు

కానీ కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామిలను అమలు చేసి చూపిస్తున్నాం

కర్నాటకలో గ్యారంటీ స్కీమ్ ను క్యాబినెట్ ప్రమాణస్వీకారం రోజునే అమలు చేసింది

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన క్యాబినెట్ ప్రమాణ స్వీకరం రోజునే అమలు చేస్తాం

మీ అస్తులు, మీ సొమ్మును బీఆర్ఎస్ దోచుకున్నది

కాళ్లేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలు దోచుకుంది

దరణి పేరుతో మీ భూములను లాక్కున్నరు

దళితల నుంచి భూమిని లాక్కున్నరు

రైతుబంధు పేదల కోసం ఉన్నవాళ్ల కోసం పెట్టిన పథకం

పబ్లిక్ కమీషన్ పేపర్ లీక్ లో కీలకంగా ఉన్నారు

2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి

మీ పైసలు, మీ అస్తులు దోపిడి చేసేందుకు బీఆర్ఎస్ దొంగ పథకాలు ప్రవేశపెడుతుంది

మన ప్రభుత్వం రాబోతుంది.. మీ పైసలు మీకు ఇవ్వబోతున్నాము

కర్నాటక కు వెళ్లి రైతులను, మహిళలను అడగండి.. కాంగ్రెష్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టిందో లేదో..

అందరు చెబుతున్నరు మీకు.. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకుంది అని చెబుతారు

నరేంద్రమోడీ ఆధాని, అంబానిలకు లాభం చేకూరుస్తున్నారు

అధానికి ప్రతి వ్యాపారం ద్వారా లాభం చేకూరుస్తున్నారు

నరేంద్రమోదీ చేయబట్టి ప్రపంచంలోనే అదాని దనవంతుడైయ్యాడు

నేను పార్లమెంట్ లో మోడీ, అధాని గురించి మాట్లాడితే స్వచ్ బంద్ చేశారు.. పార్లమెంట్ నుంచి బయటకు నెట్టేశారు

కేసీఆర్ ప్రభుత్వ, ప్రజల ఆస్తిని కుటుంబానికి దోచిపెడుతున్నారు.

నరేంద్రమోడీ, కేసీఆర్ కు ఒప్పందం ఉంది

నరేంద్రమోడీ, కేసీఆర్ కరప్షన్ గురించి మాట్లాడరు.. చర్యలు తీసుకోరు

నరేంద్రమోడీ, కేసీఆర్ మద్దతు దారని తెలుసు

వేరే రాష్ట్రాల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని డిస్టబ్ చేస్తున్నారు

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు పార్టనర్స్

కాంగ్రెస్ పార్టీ రైతులకు, నిరుపేదలకు,ఆదివాసులకు, వెనకబడిన వారందరికి మద్దతుగా ఉంటుంది

కాంగ్రెస్ పార్టీ దర్వాజలు అందరి కోసం తెరిచి ఉంటాయి

బీజేపీ సమాజంలో విద్వేషం రెచ్చగొడితే, కాంగ్రెస్ పార్టీ అందరికి ప్రేమను పంచుతుంది

నేను చాలా సార్లు చెప్పాను..విద్వేషం కాదు ప్రమేతో ఉండాలని.. ఆ ప్రేమ దుకాణాన్ని కాంగ్రెస్ భారతదేశంలో తెరిచింది

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వండి

చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు.. అందరికి ధన్యవాదాలు.. జై హిందు.. జై తెలంగాణ