‘ఛలో సరూర్ నగర్’ కు తరలిరండీ: డాక్టర్ రవి
విలేకర్ల సమావేశంలో ఇల్లందు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రవి
‘ఛలో సరూర్ నగర్’ కు తరలిరండీ: డాక్టర్ రవి
== యువత పెద్ద ఎత్తున కదలిరావాలిః
== విలేకర్ల సమావేశంలో ఇల్లందు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రవి
== పాదయాత్ర 600 కిలోమీటర్ల పూర్తి అయిన సందర్భంగా భట్టికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఈనెల ఎనిమిదో తారీఖున సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో జరిగే నిరుద్యోగ సభను విజయవంతం చేయాలని, నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులను, విద్యార్థులను నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఇల్లెందు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రవి పిలుపునిచ్చారు. కొత్త బస్టాండ్ లోని రాజీవ్ భవన్ లో పత్రికా సమావేశం నిర్వహించిన ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి మాట్లాడుతూ
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యం: జావిద్
కేంద్రంలో మోడీ సర్కార్ బిజెపి ప్రభుత్వం ఏర్పడితే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గత తొమ్మిది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన అనంతరం తెరాసా పరిపాలనలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామినిచ్చిగడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కేవలం 30 వేల ఉద్యోగాలను అది కూడా పోలీస్ ఉద్యోగాలను మాత్రమే రిక్రూట్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన ప్రజాస్వామ్య వాదులపైన, విద్యార్థుల పైన ,నిరుద్యోగుల పైన కార్మికుల పైన, కర్షకుల పైన నిర్బంధాన్ని చేస్తున్నదని వారు ఆరోపించారు. ఇంతవరకు గ్రూపు 1 ఉద్యోగ నియామకాన్ని సక్రమంగా నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేయక నిరుద్యోగుల ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: నయీం డైరీ ఏమైంది?: భట్టి
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ వద్ద ఎన్రోల్మెంట్ చేసుకొని ఉన్నారని వారికి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పించకపోగా , రెండవసారి అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి చెల్లిస్తానన్న కెసిఆర్ మాటలు వట్టి నీటి మీద మూటల్ల ఉన్నాయని, తద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఉన్న భూమిని అమ్ముకుని, అప్పు, సప్పుచేసి సంవత్సరాల తరబడి కోచింగ్ లు తీసుకుంటూ ఉన్నా కూడా నిరుద్యోగుల పట్ల కపట ప్రేమ ఉన్న ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలు అగమ్య గోచరంగా రోడ్డుమీద పడిందని వారు ఆరోపించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్య వ్యవస్థ పనితీరు చాలా దారుణంగా ఉందని టెన్త్ క్లాస్ మొదలుపెడితే టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల వరకు అన్ని లీకులు చేసుకుంటూ అటు విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ బిఆర్ఎస్ సర్కార్ లీకేజీల సర్కార్ గా పేరుగాంచిందని వారు ఆరోపించారు. తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో నలిగిపోయి అగమ్య గోచరంగా మారిన నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపడం కోసం రేపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు చేయబోయే మేలుని గురించిన నిరుద్యోగ డిక్లరేషన్ ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సరూర్ నగర్ బహిరంగ సభలో ప్రకటన చేయబోతున్నారు అని వారు తెలిపారు. కావున పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ నిరుద్యోగ సభకు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
== 600 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా అభినందనలు
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇందిరమ్మ రాజ్యాస్థాపన జరగాలని దృడ సంకల్పంతో ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో భాగంగా నిన్నటితో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వరకు 600కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకున్నందున కేక్ కట్ చేసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అభినందనలు తెలిపారు. ఈ పత్రిక సమావేశంలో వారితోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాణాల శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ ధరావత్ కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైఎస్ చైర్మన్ బీఎన్ గోపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసిక తిరుమల్, పట్టణ కాంగ్రెస్ మహిళా నాయకురాలు జ్యోతి, రవి, ఇల్లందు నియోజకవర్గ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ అరవింద స్వామి, ఇల్లందు పట్టణ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాషా, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న భట్టి పాదయాత్ర