తైతక్కలు ఆడితే ప్రజలు నమ్ముతారా..?: మంత్రి
== అర్భన్ మండలానికి కాంగ్రెస్ ఏం చేసింది..?
== టక్కుటమారా మాటలకు ప్రజలు మోస పోరు
== కాంగ్రెస్ పై మండిపడిన మంత్రి పువ్వాడ
== ఈర్లపూడి అభివృద్ది లో నెంబర్ వన్
== రూ.3.45 కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
అర్బన్ మండలంలో నాటి ప్రభుత్వాలు ఏం చేసినయ్..? ఎవరైనా చేసిన వారు ఉన్నారా..? టక్కు టమార గోకర్ణ, గజకర్ణ విద్యలు ప్రదర్శిస్తే ప్రజలు నమ్ముతారా..? ఇక్కడికి ఒకాయన వచ్చి డాన్సులు చేసి పోయిండు..? ఆయన పరిపాలనలో అర్భన్ మండలానికి ఏం చేసిండు..? రా ప్రజల్లోకి వచ్చి చెబుదాం.. ఈ మండలానికి ఏం చేసినవో నువ్వు చెప్పు.. నేను చెబుతా..? తైతక్కలు ఆడితే ప్రజలు నమ్ముతారా..? అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.
ఇది కూడా చదవండి:- ఇక్కడే పుట్టా..ఇక్కడే పెరిగా: మంత్రి
రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు.ఈ మేరకు రూ.3.45 కోట్లతో పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు వచ్చిన మంత్రి పువ్వాడ కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు. రోడ్ షో ద్వారా గ్రామంలో పర్యటించి ఆయా అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈర్లపుడి గ్రామం నుండి లచ్చిరాం తండా వరకు రూ.1.78 కోట్లతో బిటి రోడ్డు రెన్యువల్, ప్రత్యేక మరమ్మతుల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. ఈర్లపుడి నుండి దొనబండ వరకు రూ.1.22 కోట్లతో బిటి రోడ్డు రెన్యువల్, ప్రత్యేక మరమ్మతుల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. గ్రామంలో సీఎస్ఆర్ ట్రాన్స్ కో నిధులతో రూ.14 లక్షలతో డొంక రోడ్లను మట్టి రోడ్లు గా మార్చిన రోడ్లను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సుడా నిధులతో ఈర్లపుడి గ్రామ సెంటర్లలో రెండు చోట్ల ఎర్పాటు చేసిన హై మాస్ట్ లైట్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.ఎస్ డీఎఫ్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించనున్న ఐదు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.
ఇది కూడా చదవండి:+ తుమ్మలపై మంత్రి సెటైర్.. ఏమన్నారంటే..?
గ్రామంలో ఈజీఎస్ నిధులు రూ.25 లక్షతో నిర్మించిన 10సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.. రఘునాధపాలెం మండలంలో ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో రూ.250 కోట్లు ఒక్క మండలంలో మంజూరు చేశామని, నిధులను వరద లాగే పారించడం ద్వారానే ఇంత అభివృద్ది సాధ్యమైంది. తండాలో ఉన్న ప్రతి రోడ్డును సీసీ రోడ్లు గా మార్చిన.. సీఎస్ఆర్ ట్రాన్స్ కో నిధులు రూ.4.40 కోట్లతో డొంక రోడ్లన్నీ విస్తరించి మట్టి రోడ్లుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. మండలంలో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇచ్చినం.. రూ.99,999 వెలు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసినం.. ఇది కదా కేసీఅర్ కి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ది అని అన్నారు. ప్రతి గ్రామాల్లో చెరువులు బాగు చేసుకున్నం..
కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వొద్దు అన్న రేవంత్ రెడ్డి కావాలా..? నిరంతరం విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా అని అన్నారు. మనకు ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళు పెట్టుకునే అవకాశం కల్పించిన కేసీఅర్ ని మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే విధంగా బీఆర్ఎస్ ని గెలిపించుకోవాలని అని స్పష్టం చేశారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే అందులో 50 సంవత్సరాలు మీరే పాలించారు.. ఎం చేశారో గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పాలి.. తట్టాడు మట్టి పోయ్యలే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక కోట్ల రూపాయల నిధులు పారించి ఇంత అభివృద్ది చేసినమన్నారు.
ఇది కూడా చదవండి:- తుమ్మలతో భట్టి ఏం మాట్లాడారు..?
అర్బన్ మండలంగా ఉన్న సమయంలో ఎం చేసింది కాంగ్రెస్… నేను ఎమ్మేల్యే గా అయిన తరువాతేగా గెజిట్ నోటిఫికేషన్ వేయించి రఘునాథపాలెం మండలంగా పేరు పెట్టి ఒక్కొక్కటి సాధించుకున్నామని, మండల గిరిజనులు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని, గడచిన 10ఏళ్ల నుండి నిత్యం వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే పని చేశామని ఇంకా మరింత అభివృధ్ది చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్, డిసిసిబి ఛైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, వైస్ చైర్మన్ అఫ్జల్, ఎంపిపి గౌరీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరు నాయక్, ఎంపిటిసి జానకిరాం, మధన్, వెంకటేశ్వర్లు, చిట్టెం నరసింహరావు, మద్దిననేని వెంకటరమణ, కుర్రా భాస్కర్ రావు, పిన్ని కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.