Telugu News

రాహుల్ గాంధీతో ‘పొంగులేటి’ చర్చలు సఫలం..?

పార్టీలో చేరనున్న ‘ఆ నలుగురు’

0

కాంగ్రెస్ గూటికి ‘పొంగులేటి’

== రాహుల్ గాంధీతో చర్చలు సఫలం..?

== పార్టీలో చేరనున్న ‘ఆ నలుగురు’

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  హస్తం గూటికి చేరడం ఖాయమైంది.. రాహుల్ గాంధీ సమక్షంలో బీఆర్ఎస్ అసమ్మతి నేతల్లో  ‘ఆ నలుగురు’ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరించారు. రాహుల్ గాంధీతో డీకే శివన్న దూత ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్ లో జరిగిన చర్చలు సఫలమైయ్యాయి.. కాగా ఈనెల 22న ఢిల్లీలో సోనియాగాంధీ నివాసంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ఆ నలుగురు నేతలు సమావేశం కానున్నారు. అవకాశం ఉంటే అదే రోజున లేదంటే ఈనెల 28న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ నలుగురు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే చర్చకు ఇక పుల్ స్టాఫ్ పడినట్లే.. కాగా పొంగులేటి వర్గీయుల్లో సంతోషం నెలకొంది.. వారందరు సంబురాలు చేసుకునే పనిలో పడ్డారు.   పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇది కూడా చదవండి: సమయం ఆసన్నమైంది..ఇక కురుక్షేత్రమే: పొంగులేటి 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో జాప్యం జరుగుతున్న సందర్భంలో నేరుగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఆయన గత రెండు రోజుల క్రితం డీకే శివకుమార్ తో చర్చలు జరిపారు. దీంతో రంగంలోకి దిగిన డీకే శివన్న  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించి నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తామని తెలిపారు. దీంతో శనివారం ఉదయం రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తో జూమ్ మీటింగ్ జరిగింది. ఈ జూమ్ మీటింగ్ లో చర్చలు జరిపిన అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి క్రిష్ణారావు, దామోదర్ రెడ్డితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీలో చేరతారని పొంగులేటి రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టచ్ లో ఉన్నట్లు సమాచారం.

== 22న రాహుల్ గాంధీతో భేటి.. 28న పార్టీలో చేరిక

ఈనెల 22న ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బేటికానున్నారు. జూమ్ మీటింగ్ లో కొన్ని విషయాలను మాత్రమే చర్చించడంతో ఈనెల 22న ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరినట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: జై కాంగ్రెస్ నినాదంతో దద్దరిల్లిన పొంగులేటి శిబిరం

ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జూపల్లి క్రిష్ణారావు, దామోదర్ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లతో పాటు పొంగులేటి వర్గీయుల్లో ప్రధాన నాయకులు ఢిల్లీకి  వెళ్లనున్నారు. 22న అవకాశం ఉంటే పార్టీలో చేరడం లేదంటే ఈనెల 28న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో, లేదంటే ఈనెల 30 మహుబూబ్ నగర్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరడం దాదాపుగా ఖారారైనట్లుగా తెలుస్తోంది. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టే పాదయాత్ర ముగింపు సభకు ఈ నలుగురితో పాటు పొంగులేటి అనుచరులు హాజరవ్వనున్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీగా పొంగులేటి వర్గీయులను తరలించే అవకాశం ఉంది.