Telugu News

మహిళల కోసం నా సీటు త్యాగం చేస్తా: మంత్రి 

సంచలన ప్రకటన చేసిన మంత్రి పువ్వాడ

0

మహిళల కోసం నా సీటు త్యాగం చేస్తా: మంత్రి 

== ఖమ్మం స్థానం రిజర్వ్ అయితే, నా ఇంట్లో నుండి ఎవరు పోటీలో ఉండరు

== సంచలన ప్రకటన చేసిన మంత్రి పువ్వాడ

== ఎవడికి కావాలి మీ గ్యారెంటీ కార్డు.. ఇన్నాళ్లు ఏమైంది మీ గ్యారెంటీ.

== కాంగ్రీసోళ్లకు గ్యారంటీ ఉందా..?

== ప్రశ్నించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== గ్రామాల్లోని డొంక రోడ్లను విస్తరించి మట్టి రోడ్లు వేసింది బీఆర్ఎస్

== తండాలను పంచాయతీలను చేసింది సీఎం కేసీఆర్

== పంచాయతీలను అభివృద్ది చేసింది మేమే

== రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ది పథకాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

(ఖమ్మంప్రతినిధి, రఘునాథపాలెం-విజయంన్యూస్)

మహిళా బిల్లు వచ్చింది.. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం సీటు త్యాగం చేసేందుకు నేను సిద్దం.. మహిళా రిజర్వేషన్ వస్తే మా కుటుంబ సభ్యులేవ్వరు పోటీ చేయరు.. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే మహిళకు టిక్కెట్ ఇస్తాం.. బీఆర్ఎస్ అంటేనే మహిళలకు ప్రాధాన్యత కల్పించే పార్టీ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి:- కొందరి శిఖండి రాజకీయాలకు భయపడం: మంత్రి పువ్వాడ

ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో ట్రాన్సో సీఎస్ఆర్, ఎజీఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ, సుడా  నిధులు రూ.4.40 కోట్లతో పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆయా గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్స్ ను ప్రారంభించారు. సుడా నిధులు రూ.2.50 కోట్లతో హర్య తండా, బద్య తండా, పుఠాని తండా, సూర్య తండా, వాంకుడోతు తండా, రాంక్య తండా గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో నూతనంగా ఎర్పాటు చేసిన హై-మాస్ట్ లైట్స్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో రూ.2.40 కోట్లతో సీసీ రోడ్లు, సీసీ కల్వర్ట్ లు, సైడ్ డ్రెయిన్లు తదితర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తండా లను పంచాయతీ లుగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ గ్రామాన్ని మీరే పాలించుకునే అవకాశం ను కల్పించింది అన్నారు. ఒకప్పుడు మండలం కు ఒక కోటి రూపాయలు రావడం గగనం. కానీ నేడు మండలంలో ప్రతీ గ్రామానికి కోటి రూపాయలకు పైగా ఇప్పటికే ఇచ్చి అభివృద్ది చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వందన్నారు. మళ్లీ మన ప్రభుత్వం ను గెలిపించుకోవాలని తద్వారా ఇలాంటి అభివృద్ది కోసం మరిన్ని కోట్లు తీసుకువస్తానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- త్వరలో లకారం వద్ద మరో అద్భుతం ఆవిష్కృతం: మంత్రి

మండలంలో 12 కొత్త బీటీ రోడ్లు మంజూరు చేసామని, ఆగస్ట్ లో రూ.13 కోట్లు, మొన్న రూ.12 కోట్లు మూడు నెలల కాలంలోనే రూ.25 కోట్లతో 12 కొత్త బీటీ రోడ్లు సాధించుకున్నామని పేర్కొన్నారు.  గ్రామాల్లోని డొంక రోడ్లను విస్తరించి మట్టి రోడ్లు, కచ్చా రోడ్లు అన్ని సీసీ లు గా మార్చిన అని అన్నారు. తండాలుగా ఉన్న వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం.. మారిన గ్రామాల్లో అన్ని రోడ్లు సీసీ లుగా మార్చిన. నేడు గ్రామాల్లో మట్టి రోడ్లు లేకుండా చేసినం.. వెతికి వెతికి రోడ్లు అన్ని సిసిలుగా చేసిన గ్రామాల అభివృద్ది కోసం కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినం అని అన్నారు. ఇప్పటి వరకు రఘునాథపాలెం మండలంకు రూ.250 కోట్లు తీసుకొచ్చి ఖర్చు చేసిన విషయం గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి:-ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పై కరుణ చూపాలి: మంత్రి పువ్వాడ

ఒకప్పుడు గ్రామాల్లో రైతుల మోటార్ లు కాలిపోయిన ఘటనలు గుర్తు చేశారు. కాలిపోయిన మోటార్ లను బాగు చేసుకోవడానికి వారం నుండి పది రోజుల సమయం పట్టేది.. ఈ లోగా పంటలు ఎండిపోయి రైతులు గోస పడ్డారని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ పోతుందా… పైగా 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా.. నాలుగు గంటల విద్యుత్ సరిపోతుంది అన్న కాంగ్రెస్ కావాలా అని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క పథకం కూడా ఆగలేదని, రైతు బందు, ఆసరా పెన్షన్, ఆగిందా ఎప్పుడైనా అని ప్రశ్నించారు..

ఇది కూడా చదవండి:- కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..

కోవిడ్ సమయంలో ఎమ్మల్యే ల జీతాలు ఆపారు కానీ పేదల పెన్షన్ ఆగకుండా ప్రతి నెల ప్రభుత్వ జీతం మాదిరిగా ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందే అన్నారు.

 == మహిళలకు నా సీటు ఇచ్చేస్తా: మంత్రి

మహిళ బిల్లు వచ్చింది.. మహిళల కోసం అవసరమైతే నా సీటు కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో ప్రభుత్వం ఎప్పుడూ వెనుకడుగు వేయదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే సారి నుండి మహిళలకు ఖమ్మం స్థానం రిజర్వ్ అయితే, నా ఇంట్లో నుండి ఎవరు పోటీలో ఉండరని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:- పేదల సొంత ఇంటి కల గృహ లక్ష్మీపథకం.. మంత్రి పువ్వాడ..

పార్టీ కోసం పని చేసిన మహిళలు మాత్రమే పోటీలో ఉంటారన్నారు. కొందరు దండాలు పెట్టుకుంటు వస్తారు.. దండం పెట్టి కనిపించారు.. వాళ్ళకు దూరం గా ఉండాలని సూచించారు. ఎవడికి కావాలి మీ గ్యారెంటీ కార్డు.. ఇన్నాళ్లు ఏమైంది మీ గ్యారెంటీ.  మీకే లేదు గ్యారెంటీ .. ఇంకా ప్రజలకు ఎం గ్యారెంటీ ఇస్తారు వీళ్లు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ గౌరీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అఫ్జల్, సర్పంచ్ లు కాంతి, అమలి, సుగుణ, మెంటెం రామారావు, ప్రదీప్, బాలాజీ, నాయకులు మందడపు నర్సింహ రావు, సుధాకర్, లక్ష్మణ నాయక్, కొంటేముక్కల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.