Telugu News

కార్యకర్తలకు అండగా ఉంటా : నామ నాగేశ్వరరావు

ఉప్పలమ్మ వేడుకలో పాల్గొన్న నామ

0

కార్యకర్తలకు అండగా ఉంటా : నామ నాగేశ్వరరావు

❇️ ఉప్పలమ్మ వేడుకలో పాల్గొన్న నామ

(ఖమ్మం -విజయం న్యూస్)

కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండి,కాపాడుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. రఘునాధపాలెం మండలం గణేశ్వరం గ్రామo లో ఆదివారం యసా రామారావు, ధువు గాజుల వీరయ్య ఉప్పలమ్మ పెట్టుకోగా నామ నాగేశ్వరరావు వారింటికి వెళ్లి, కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి , పార్లమెంట్ కు పంపించాలని గ్రామస్తులను కోరారు.గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును కలిసి, తన గెలుపునకు పని చేయాలన్నారు. పాత మిత్రులను, శ్రేయోభిలాషులను, అభిమానులను కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శీలంశెట్టి వీరభద్రం, యసా రామారావు, మాజీ సర్పంచ్ లు మెంటెo రామారావు, యెల్ల బాబు,ఆకుల గాంధీ, కనగంటి హన్మంతరావు, దుంప రవి, జోగు గోవర్ధన్, కొర్రా తులస్య, జోగు పుల్లయ్య,తాళ్లూరి హరీష్, పాల్వంచ రాజేష్,చీకటి రాంబాబు , సరిపూడి గోపి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ లో ప్రజా గొంతుకనై ప్రశ్నిస్తా : నామ