Telugu News

జిల్లా వాసి కోటి గెలిచేనా..?

‘మీలో ఎవరు కోటేశ్వరులు’ షోలో రాజారవీంద్ర కోటి గెలిచే అవకాశం..?

0

జిల్లా వాసి కోటి గెలిచేనా..?

— ‘మీలో ఎవరు కోటేశ్వరులు’ షోలో రాజారవీంద్ర కోటి గెలిచే అవకాశం..?
— అభినందనలు తెలుపుతున్న నేటిజన్లు.

(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్) :-

ఓ టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. సుజాతనగర్‌ మండలానికి చెందిన బి. రాజారవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్‌ఎస్‌ రాజు-శేషుకుమారి దంపతుల కుమారుడు రాజారవీంద్ర డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల షోలో పాల్గొన్న ఆయన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  రూ.కోటికి సంబంధించిన ప్రశ్న అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ రవీంద్రను అడగ్గా.. సమాధానం చెప్పి ఫిక్స్‌ చేయండి అంటూ రవీంద్ర మాట్లాడిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ఈ ఎపిసోడ్‌ ప్రసారం కావాల్సి ఉండగా.. రవీంద్ర, నగదు గెలుచుకున్న విషయాన్ని షో నిర్వాహకులు ధ్రువీకరించాల్సి ఉంది.

 

Also read :- టాస్క్ ఫోర్స్ పోలీస్ ఆధ్వర్యంలో గోదావరిఖని లో పేకాట స్థావరం పై మెరుపు దాడి.

Also read :-ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు ప్రశంసలు– ఖమ్మం పోలీస్ కమిషనర్.