Telugu News

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: నామా

ఏన్కూరు రోడ్ షో లో నామ

0

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: నామా

== ఏన్కూరు రోడ్ షో లో నామ

ఏన్కూరు. మే 10(విజయం న్యూస్):
. తనను మరోసారి ఆదరించి గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని బిఆర్ఎఫ్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఏన్కూరు లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా రైతు బిడ్డను, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, గొంతులో ప్రాణం ఉన్నంతవరకు ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:- నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు: నామ

పార్టీలకతీతంగా ప్రజా సేవ చేస్తున్నానని అన్నారు. కార్యకర్తలు సైనికుల పనిచేసే తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల వలన అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో చతికల పడిందని ఎద్దేవ చేశారు. ఈ రోడ్ షోలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ,మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్, జడ్పిటిసి బాదావత్ బుజ్జి, దిశా కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ, ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వర్లు, నాయకులు వేముల రమేష్ బాబు, పొన్నం హరికృష్ణ మాదినేని అశోక్, భూక్యా బాలాజీ, పూర్ణ కంటి నాగరాజు,నజీర్,గడ్డం వెంకటేశ్వర్లు, చీటీ కోటేశ్వరరావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు