Telugu News

ముదిరాజ్ సోదరులకు నామినేటెడ్ పోస్ట్ కల్పించేందుకు కృషి చేస్తా.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి – పువ్వాడ అజయ్ కుమార్.

ముదిరాజ్ వనసమారాధన ప్రోగ్రామ్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి - పువ్వాడ అజయ్ కుమార్.

0

◆ ముదిరాజ్ సోదరులకు నామినేటెడ్ పోస్ట్ కల్పించేందుకు కృషి చేస్తా – మంత్రి పువ్వాడ.

◆ ముదిరాజ్ వనసమారాధన ప్రోగ్రామ్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి – పువ్వాడ అజయ్ కుమార్.

(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్) :-

ఖమ్మంలో రాజకీయంగా రాణిస్తున్న ముదిరాజ్ కులం కు చెందిన లీడర్ల కు సీఎం కేసీఆర్ గారితో మాట్లాడి నామినేటెడ్ పోస్టు కల్పించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఖమ్మంలోని ముదిరాజ్ ఐక్య వేదిక అధ్యక్షురాలు ప్రస్తుత కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత ఆధ్వర్యంలో ఆదివారం చెరుకూరి తోటలో నిర్వహించిన కార్తీక మాస వన సమారాధనకు ముదిరాజ్ కుల బంధావులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

కార్యక్రమంకు ముదిరాజ్ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తనయుడు కాసాని వీరేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.

తొలుత ఐక్య వేదిక ఫౌండర్స్ ఆధ్వర్యంలో కుల దైవాన్ని పూజించి, జ్యోతి ప్రజ్వలన చేశారు.

అనంతరం 1986 లో ముదిరాజ్ ఐక్య వేదిక కు ఫౌండేషన్ కు కృషి చేసిన పిట్టల నాగేశ్వరరావు, వెంకట నర్సయ్య, ప్రతాపునేని వెంకటేశ్వరరావు, కాశబోయిన అనంత రాములు తదితరులను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ..

ఈ వన సమారాధనకు నేను ఓక ముదిరాజ్ గా వచ్చానని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికలో ముదిరాజ్ లకు నాలుగు కార్పొరేటర్ సీట్లు ఇచ్చానని పేర్కొన్నారు.

రాజకీయాలలో యువత రాణించాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తానని అన్నారు.

ముదిరాజ్ సోదరులకు ఎప్పుడు, ఎలాంటి ఆపద వచ్చిన ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముదిరాజ్ లకు చెరువులు, చేపల పైన సీఎం కేసీఆర్ హక్కు కల్పించారని పేర్కొన్నారు.

బీసీల గౌరవాన్ని నిలిపేల బైపాస్ రోడ్ నందు బీసీ భవన్ నిర్మిస్తున్నామని అన్నారు. ముదిరాజ్ భవనం కూడా కృషి చేస్తానని తెలిపారు.

ఆర్ధికంగా, రాజకీయంగా నిలదొక్కుకునేందుకు వారికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. బండా ప్రకాష్ కు గతంలో ఓటేశానని గుర్తు చేశారు.

 

also read :-12 ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్సీ ల జాభితా ?