Telugu News

నిగ్గదీస్తే దాడి చేస్తారా…?: పొంగులేటి

అధికారులా..? గులాబీ కార్యకర్తలా..??

0

నిగ్గదీస్తే దాడి చేస్తారా…?: పొంగులేటి

== అధికారులా..? గులాబీ కార్యకర్తలా..??

== ఘటనకు మంత్రి పువ్వాడ పూర్తి బాధ్యత వహించాలి

== తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

(ఖమ్మం-విజయంన్యూస్):

 వైఎస్సార్ కాలనీలో అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించలేదని నిలదీసిన వారిపై మంత్రి పువ్వాడ అనుచరులు, పోలీసులు దాడి చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు.

ఇది కూడా చదవండి:-:ఖమ్మంలో మంత్రికి షాక్..ఎందుకంటే..?

జాబితాలో ఉన్న కొంతమంది అర్హుల పేర్లను మాయం చేశారని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, కొంతమంది దళిత, గిరిజన మహిళలు, యువకులు, స్థానికులు మంత్రి అజయ్ ని నిగ్గదీస్తే వారి పై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు గులాబీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసనకారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులను పెట్టడం సమంజసం కాదని తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం కనీసం స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్కు సమాచారం ఇవ్వక పోవడం దారుణమన్నారు. ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సింది పోయి నిగ్గదీసిన వారిపై దాడి చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- నువ్వేదో పొడుస్తావని నిన్ను  గెలిపించలేదు: పొంగులేటి

ఈ ఘటనకు మంత్రి పూర్తి బాధ్యత వహిస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణ చేయించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పించాలని, లేని పక్షంలో ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. అదే విధంగా తమ పార్టీ నేతలు, స్థానికులపై అక్రమంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.