Telugu News

ధాన్యం కొనుగోలు చేస్తారా.. ప్రగతి భవన్ ముట్టడించాలా..?

** వ్యవసాయ సాగు చట్టాల రద్దు కాంగ్రెస్ పారాట ఫలితమే.

0

ధాన్యం కొనుగోలు చేస్తారా.. ప్రగతి భవన్ ముట్టడించాలా..?

** వ్యవసాయ సాగు చట్టాల రద్దు కాంగ్రెస్ పారాట ఫలితమే.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో కల్లాలను పరిశీలించిన సీఎల్పీ లీడర్ భట్టి..

(కూసుమంచి – విజయం న్యూస్):-

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం లో నైనా రాష్ట్ర ప్రభుత్వానిదే.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం ఉంది ధాన్యాన్ని కొనుగోలు చేసే శక్తి కూడా ఉంది.

ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎలా పారదోలేమో టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాన్ని కూడా అలానే నా పరదోలే పరిస్థితి ఏర్పడుతుంది.

*ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం మిల్లర్లుతో కుమ్మక్కు కావడమే ఈ కొనుగోలు కేంద్రాలన ఆలస్యనికి కారణం.

రైతు పండించిన ధాన్యానికి కమీషన్ల కోసం తరుగు పేరుతో దోపిడీ జరుగుతున్న సంస్కృతి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది.

ధాన్యం అమ్ముకునేందుకు 25 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రం లోని వేచి చూడాల్సిన పరిస్థితి.

తీవ్ర వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం కుప్పల మీద పడుకొని గుండెపోటుతో రైతులు మృతి చెందుతున్నారు.

రైతు వద్ద నుంచి పంట కొనాల్సింది, రాష్ట్ర ప్రభుత్వమే స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచి రైతులు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఒక్కకేసీఆర్ ప్రభుత్వం మాత్రమే.

ప్రభుత్వం ఇలానే చేస్తే రైతులంతా కలిసి పెద్ద ఉద్యమం చేపట్టి ప్రభుత్వంని లేకుండా చేయటం కొద్దిరోజుల్లోనే జరుగుతున్నది.

కేంద్ర ప్రభుత్వం తీసుక వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ఫలితమే.

దేశంలో ప్రజల ను కాదని ప్రభుత్వం ఏపని చేసిన ప్రభుత్వ లు నిలబడవు.

ఇప్పటికైనా రాష్ట్రంలో రైతాంగం పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనుగోలు చేయాలి.

*ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసమే చేసేది అయితే ధర్నాలు, దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయవచ్చు.

రాష్ట్ర పాలనలో చిత్తశుద్ధి లేదు సంకల్ప బలం లేదు.
రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల అప్పులు మిగిల్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.

రైతు పండించిన ధాన్యం కొన లేకపోతే ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా చెప్తున్నా ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులతో రైతులు లక్ష ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని కొనలేకపోతున్నారు సిగ్గుపడాలి.

also read :- ధాన్యం కొనుగోలు చేస్తారా.. ప్రగతి భవన్ ముట్టడించాలా..?