Telugu News

పొంగులేటి  కలుస్తారా..? కలిసిపోతారా..?

రేపు మధ్యాహ్నం 3గంటల రాహుల్ గాంధీతో భేటి

0

పొంగులేటి  కలుస్తారా..? కలిసిపోతారా..?

== ఢిల్లీకి చేరిన పొంగులేటి, జూపల్లి  అండ్ టీమ్

== రేపు మధ్యాహ్నం 3గంటల రాహుల్ గాంధీతో భేటి

== పార్టీలో చేరతారా..? కలిసి వస్తారా..? 

== ఢిల్లీలో రేపు ఏం జరగబోతుంది..? 

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ పేవరేట్ పొలిటిషయన్ గా పేరుగాంచిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని కలిసేందుకు ఢిల్లీకి చేరారు. అభిమానులు, అనుచరులు, ప్రజలు ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు ఏ పార్టీలో చేరతారు..? ఎక్కడ చేరతారు..? అని నెలల తరబడి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అభిమానులకు, అనుచరులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పీట్ న్యూస్ అందించారు..

ఇది కూడా చదవండి: షర్మిళ..విలీనామా..? విహారమా..?

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తన అనుచరులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు భధ్రాద్రికొత్తగూడెం జడ్పీచైర్మన్ కోరం కనకయ్య,మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,ఆయా నియోజకవర్గ బాధ్యులు కోటా రాంబాబు, తెల్లం వెంకట్రావ్, అదినారాయణ, మద్దినేని స్వర్ణకుమారి, రామసహాయం నరేష్ రెడ్డి, విజయబాయి, వైరా నియోజకవర్గం నుంచి మున్సిపల్ చైర్మన్ జయపాల్ తదితరులు ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిలతో పాటు వారి అనుచరులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వారందరు సోనియా గాంధీ నివాసంలో  సోమవారం మధ్యాహ్నం 3గంటలకు రాహుల్ గాంధీతో భేటి అవనున్నారు. అసలైతే ఉదయం 10గంటలకే సమయం ఇచ్చినప్పటికి రాహుల్ గాంధీకి అత్యవసర సమావేశం ఉండటంతో పొంగులేటి, జూపల్లి తో మధ్యాహ్నం 3గంటలకు మీట్ అవుతానని రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. దీంతో వారందరు కాంగ్రెస్ భవన్ లో విశ్రాంతి తీసుకోనున్నారు.

== కలిసి వస్తారా..? కండువ వేసుకుని వస్తారా..?

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గాను రాష్ట్ర రాజకీయ సమీకరణాలు, టిక్కెట్ల విషయంపై చర్చించేందుకు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు అండ్ టీమ్ సభ్యులు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు రాహుల్ గాంధీతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితులను పొంగులేటి వివరించనున్నారు. టిక్కెట్ల విషయంలో ఇప్పటికే ఒక లెక్క తెలిందనే ప్రచారం జరుగుతోంది. మరికొన్ని సీట్లు కేటాయించాలని అడిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి: భట్టి

ఇక వ్యాపార రిత్యా బీజేపీ పార్టీ బెదిరింపులకు దిగే అవకాశం ఉందని, ఆ విషయంపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. చర్చల అనంతరం  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీతో మీట్ అయిన తరువాత అక్కడే కాంగ్రెస్ పార్టీలో చేరతారా..? ఖమ్మం జిల్లాకు వచ్చి అభిమానులు, అనుచరులాందరి సమక్షంలో పార్టీలో చేరతారా..? అనే విషయంపై  ఉత్కంఠ కొనసాగుతోంది.. ఖమ్మంలోనే అందరి సమక్షంలో చేరతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే అనేక మార్లు చెప్పినప్పటికి రాజకీయ సమీకరణాల్లో భాగంగా రాహుల్ గాంధీతో చర్చ అనంతరం పార్టీలో చేరే అవకాశం దని తెలుస్తోంది.  ఏఐసీసీ నుంచి విజయం ప్రతినిధికి అందిన సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం 3.30గంటలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్నారావుతో పాటు వారి అనుచరులు, ఎమ్మెల్యే ఆశావాహులు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అక్కడ తాత్కాలికంగా పార్టీలో చేరిన అనంతరం వచ్చేనెల మొదటి వారంలో ఖమ్మంలో జరిగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముగింపు సభ రోజున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అఫిషల్ గా పార్టీలో చేరే అవకాశం ఉంది. అందుకే ఈ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు పొంగులేటి టీమ్ అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

== 3 లక్షలమందితో బహిరంగ సభ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభను ఖమ్మంలో నిర్వహించాలని భట్టి విక్రమార్కి నిర్ణయించారు. ఈ సభకు ఏఐసీసీ ఆగ్ర నేత రాహుల్ గాంధీ, నలుగురు సీఎంలు, జాతీయ అధ్యక్షుడు ఖర్గే, జాతీయ స్థాయి నాయకులు ఈ సభకు అతిథులుగా హాజరుకానున్నట్లు సమాచారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో రాహుల్ గాంధీ మీటింగ్ పూర్తైన తరువాత ఏ రోజున బహిరంగ సభ నిర్వహించాలనేది తేది ఖరారు కానుంది. జులై 2న లేదంటే 4న ఖమ్మంలో బహిరంగ సభకు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఖమ్మంలోనే ప్రజల సమక్షంలో చేరతా: పొంగులేటి 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2వ తారిఖున రాహుల్ గాంధీ వస్తున్నట్లు ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నప్పటికి పక్కా సమాచారం కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు దయాకర్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. అయితే ఇద్దరు ఆగ్రనాయకులు నాయకత్వం వహిస్తున్న ఈ  సభకు సుమారు 3లక్షల మందిని తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది. అందుకు గాను పార్టీ నాయకులతో  ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసిన జిల్లా డీసీసీ  ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమైయ్యారు. ఇప్పటికే ఖమ్మంలోని మూడు  గ్రౌండ్ లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏదో ఒక స్థలాన్ని ఫైనల్ చేసి సభ ఏర్పాట్లు చేయనున్నారు.  మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంది.