Telugu News

వైన్స్ షాప్ నిర్వాహకుల ఇష్టారాజ్యం.. హెచ్చు ధరలతో విక్రయాలు.

బ్రాండెడ్ మద్యం బెల్టు షాపులకు.. చీప్ క్వాలిటీ వైన్స్ లలో.. ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు..

0

వైన్స్ షాప్ నిర్వాహకుల ఇష్టారాజ్యం..
హెచ్చు ధరలతో విక్రయాలు.

బ్రాండెడ్ మద్యం బెల్టు షాపులకు.. చీప్ క్వాలిటీ వైన్స్ లలో..
ఫిర్యాదులు ఇచ్చిన పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు..

( మహాదేవపూర్ – విజయం న్యూస్):- 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మారుమూల ప్రాంతం కాదు, ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం, నిరంతరం విఐపిల పర్యటనలు,నిత్యం వేలాది భక్తుల,పర్యాటకులతో సందడిగా ఉండే ప్రాంతం, దేశంలోనే గుర్తింపు పొందిన అతి ముఖ్య క్షేత్ర గ్రామం కాళేశ్వరం,కానీ భక్తులకు, పర్యాటకులకు,స్థానికులకు ఇక్కడ జరిగే పరిస్థితులు మాత్రం పూర్తి నిబంధనలకు విభిన్నంగా.. వైన్స్ షాపుల తీరు,అసలు ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులను నియమించిందా..? నియమిస్తే ఆ అధికారులు వైన్స్ షాపుల యాజమాన్యం ముసుగులోనే ఉండాలా..? ప్రభుత్వ ఉద్యోగులుగా తమ విధులు నిర్వహిస్తున్నారా..? అంటే స్థానికులు మాత్రం వైన్స్
షాపుల యాజమాన్యం ముసుగులోనే ఎక్సైజ్ అధికారులు,అనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే.. వారి అధికారిక పనితీరు ఎంత ఆమోఘమో దీన్ని బట్టి అందరికీ అర్థం కావచ్చు..కాళేశ్వరం లోని రెండు వైన్స్ షాపులు,ఇవి ప్రభుత్వ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా దూరం పాటించకుండా,పక్కపక్కనే ఇరు షాపుల నిర్వాహకులు సిండికేట్ గా మారి, అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని,ఇష్టానుసారంగా వైన్ షాపులో నాణ్యతలేని చీప్ క్వాలిటీ మద్యం ను రిటైల్ గా జనానికి అధిక ధరలకు,షాపులో బ్రాండెడ్ మద్యం లేదని నమ్మిస్తూ, పట్టపగలు ఇష్టానుసారంగా హెచ్చు ధరలతో బెల్టు షాపులకు అక్రమంగా తరలిస్తుండడంతో,ఇదే అదునుగా బెల్టుషాపుల వారు భావించి,అత్యధిక ధరలతో భక్తులకు, పర్యాటకులకు,స్థానికులకు ప్రముఖ మెయిన్ ఘాట్ రోడ్ బడి,గుడి,త్రివేణి నది తీరం అనే తేడా లేకుండా విక్రయాలు అధిక మొత్తంలో కొనసాగిస్తుండడంతో విధిలేక మద్యం ప్రియులు జేబులు కూని చేసుకొని,ఈ వైన్స్ షాపులను జనమంతా ఇదో పెద్ద బెల్ట్ షాపు గా భావిస్తు నిరుత్సాహంగా వెనుదిరగక తప్పడం లేదు.

also read :- ప్లాస్టి‌క్ భూతాన్ని….త‌రిమేద్దాం….!

ఫిర్యాదులు ఇచ్చిన పత్తాలేని ఎక్సైజ్ అధికారులు: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా మద్యం వ్యాపారాలు కొనసాగిస్తున్న వైన్స్ షాపుల పై ఫిర్యాదులు ఇచ్చిన అధికారులు ఎందుకు స్పందించడం,వారిపై చర్యలు తీసుకోవడం లేదని పలువురి ద్వారా ఆరోపణలు అధికంగానే వెల్లువెత్తుతున్నాయి. మద్యం పర్మిషన్ ఉన్నట్లుగా బహిరంగంగానే అత్యధిక ధరలకు విక్రయిస్తున్న బెల్టుషాపులను అధికారులు ఎందుకు నియంత్రించడం లేదని మద్యం ప్రియులు మండిపడుతున్నారు.

also read :- గైగొళ్లపల్లికే వన్నె తెచ్చిన సర్పంచ్