వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్న ప్రజలు……
పది క్వింటాళ్ల మిరపకాయల చోరీ…….
బెల్టు షాపు ధ్వంసం చేసిన దొంగల ముఠా……
( చండ్రుగొండ- విజయం న్యూస్ ): –
గత కొంత కాలం నుండి మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు హడలిపోతున్నారు…. ఇటీవల కాలంలో ఆటో, బైకు, వ్యవసాయ పొలంలో బోరులు, ట్రాన్స్ ఫారం లోని రాగి వైరు, దొంగతనలు మండలంలో అధికంగా జరుగుతున్నాయి…. గత రాత్రి తిప్పన పల్లి గ్రామానికి చెందిన ధరావత్ అర్జున తన వ్యవసాయ పొలంలో ఆరబోసిన ఎండిన మిరపకాయలను సుమారు 10 క్వింటాళ్ల వరకూ దొంగతనం జరిగిందని బోరున విలపిస్తున్నారు .. ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని తెలిపారు..
also read ;-కోవిడ్ టెస్ట్ లపై టీఎస్ హైకోర్టు ఆగ్రహం..
అదేవిధంగా తిప్పన పల్లి గ్రామ శివారులో ఉన్న ఆకుల రమేష్ బెల్ట్ షాప్ సైతం కూడా దొంగలు దొంగతనం చేసి షాపులో ఉన్న మద్యం బాటిల్స్, కూల్ డ్రింక్స్, సోడా, కొంత నగదు సైతం కూడా దొంగతనం చేసినట్టు తెలిపారు…. ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు…