Telugu News

రాజకీయంతో గ్రామాభివృద్ధిని అడ్డుకోవద్దు..

ఏప్రిల్ నుండి నూతన పథకాలకు సీఎం శ్రీకారం..

0

రాజకీయంతో గ్రామాభివృద్ధిని అడ్డుకోవద్దు..

ఏప్రిల్ నుండి నూతన పథకాలకు సీఎం శ్రీకారం..

గొల్లగూడెంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వ్యాఖ్యలు..

(విజయం న్యూస్);-

రాజకీయ కక్షలతో, గ్రూపు తగాదాలతో గ్రామాభివృద్ధిని ఎవరు అడ్డుకోవద్దని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య హితవు పలికారు. శుక్రవారం తల్లాడ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ నారపోగు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20.5 లక్షలతో నిర్మించిన సీసీరోడ్లును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంతమంది తాత్కాలిక ఆనందాల వైపు మొగ్గుచూపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, ముగిసిన తర్వాత అందరూ ఒక్కటేనన్నారు.

also read;-ఫారెస్ట్ అధికారులు ఆదివాసి పోడు భూములు జోలికి వస్తే ఊరుకోం

తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు గుర్తుచేశారు. చెక్ డ్యాం విషయంలో హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చిందని, వచ్చే నెలలోనే ఆ పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి సీఎం కేసీఆర్ మరో రెండు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టనున్నారన్నారు. ఈ బడ్జెట్లోనే 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్లు, ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ఇచ్చే కొత్త పథకాలను చేపడుతున్నారన్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

also read;-బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, తల్లాడ ఏఎంసీ చైర్మన్ రెడ్డం వీర మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్ లాల్, వైరా ఏఎంసీ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, ఆర్ఐ రాధిక, ఏఈ అశోక్, ఎంపీటీసీ ఇసుకపల్లి ఏసమ్మ, టిఆర్ఎస్ నాయకులు కోడూరు వీరకృష్ణ, బొడ్డు శ్రీను, గుండ్ల బాలకృష్ణ, గొల్లమందల సింహాద్రి, విలాసాగరం వెంకట్రావు, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

please subscribe this  chanel smiling chaithu;-