Telugu News

క్రీడలతో దేహ దారుడ్యం సొంతం

👉 యువత సన్మార్గంలో నడవాలి

0

క్రీడలతో దేహ దారుడ్యం సొంతం
👉 బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన భద్రాచలం ఎస్పీ అక్షాంశ యాదవ్
👉 యువత సన్మార్గంలో నడవాలి
👉 టోర్నమెంట్ నిర్వహణ అభినందనీయం
👉 నిర్వాహకులకు అభినందనలు ఏఎస్పి అక్షాంశ యాదవ్

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )

క్రీడలతో దేహదారుఢ్యం సొంతం అని భద్రాచలం ఏ ఎస్పీ అక్షాంశ యాదవ్ అన్నారు మండల కేంద్రం బూర్గం పహాడ్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా కొనసాగుతున్న దుగ్గిరాల ఏల్లరెడ్డి మెమోరియల్ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది.ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎస్పీ అక్షాంశ యాదవ్ హాజరైయ్యారు. మెగా ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అయ్యప్ప లేవన్ 14.3 బాల్స్ కి 10 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.99 విజయ లక్ష్యానికి దిగిన యువ లేవాన్ భద్రాచలం 13.1 ఓవర్లకి 6 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి విజయం సాధించింది

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 48 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన లోకేష్ కు లభించింది. విజేతగా గా భద్రాచలం యువ లెవెన్ జట్టు నిలిచింది రన్నరప్ గా పాల్వంచ కు చెందిన అయ్యప్ప ఎలెవన్ జట్టు నిలిచింది.అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి భద్రాచలం ఎస్పీ అక్షాంశ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు విజేతలకు రన్నర్ లకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేశారు మొదటి బహుమతి ని దుగ్గిరెడ్డి ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం దుగ్గిరెడ్డి శ్రీ రామ్ రెడ్డి సుధాకర్ రెడ్డిలు 30 వేల రూపాయల నగదును అందించారు

ద్వితీయ బహుమతి 15116 రూపాయల నగదును బొల్లు వీరభద్రం జ్ఞాపకార్థం బొల్లు రవి అందజేశారు.మొదటి ద్వితీయ ట్రోఫీలను బట్ట మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బట్ట విజయ్ గాంధీ అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గ్రామ పెద్దలు ప్రముఖ వైద్యులు డాక్టర్ చెన్నం సత్యనారాయణ ఆయన సోదరులు సూర్య ప్రసాద్ ల చేతుల మీదుగా అందజేశారు. ఈ టోర్నమెంట్ ఆద్యంతం ప్రతి మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీలను మాజేటి రామకృష్ణ ఆయన కుమారుడు సాయి అందజేశారు.టోర్నమెంట్ కు గ్రౌండ్ ను పుప్పాల వెంకటేశ్వరరావు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యయ ప్రయాసలను కుర్చీ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు కరోనా నిబంధనలు పాటిస్తూ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు మన్యంలో ప్రతిభకు కొదవలేదని దాన్ని వెలికి తీసే ఉత్సాహవంతులు ముందుకు రావాలని సూచించారు క్రీడాకారులు స్థానిక పోటీల లో రాణించి మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక చిన్నారుల చే నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది తాసిల్దార్ భగవాన్ రెడ్డి నాట్యం చేసిన చిన్నారులను అభినందించి నగదు బహుమతి అందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐ జితేందర్,సర్పంచ్ సిరిపురపు స్వప్న,సొసైటీ డైరెక్టర్ బోల్లు రవి,బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ బట్ట విజయ్ గాంధీ,గ్రామ పెద్దల డాక్టర్ చేన్నం సత్యనారాయణ చే న్నం సూర్యప్రసాద్ ఆర్.ఐలు శంకర్.అక్బర్,తోకల మోహన్ రావు,లైక్ సార్,గోనెల నర్సింహ రావు,పొప్పాలా వెంకటేశ్వర్లు, అడబలా వెంకటేశ్వరరావు, మజేటి రామకృష్ణ,గొనేల సర్వేశ్వరరావు దుద్దుకూరి రాజా,సోహెల్ పాషా, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు శ్రీరామ్ రెడ్డి,భజన ప్రసాద్ కుమార్,సుధాకర్ రెడ్డి,శనగ కిషోర్, సత్తిపండు, బబ్బురాయుడు,సారధి,మంద ప్రవీణ్,ఆర్పీ నరేష్,ఇమ్రాన్ అదే విధంగా గ్రామస్తులు గుండె వెంకన్న,గంగరాజు యాదవ్,గోనెల ప్రతాప్,బాలా యాదవ్ గ్రామస్థులు క్రీడా అభిమానులు పాల్గొన్నారు.

also read :-విద్యార్థులకు కుల,ఆదాయ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.