Telugu News

మంత్రి పువ్వాడ ఆదేశాలతో అధికారులు

అప్రమత్తం.. చర్యలు వేగవంతం

0

మంత్రి పువ్వాడ ఆదేశాలతో అధికారులు
అప్రమత్తం.. చర్యలు వేగవంతం

★ శిథిలావస్థ భవనాలు, ప్రమాదకర వృక్షాలపైచర్యలు వేగిరం

ఖమ్మం నగరంలో శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీ చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించిన నేపథ్యంలో నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. ముందస్తు చర్యలలో భాగంగా ప్రత్యేక బృందాన్ని నియమించి చర్యలు ముమ్మరం చేశారు.

also read;-కూసుమంచి మండల పరిషత్ లో కరోనా కలకలం

నగరంలోని వివిధ ప్రాంతాలలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసిస్తున్న వారికి అవగాహన కల్పిస్తూ ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా నగరంలో మోడువారి శిధిలమై నెలకొరిగేందుకు సిద్దంగా ఉన్న భారీ, ప్రమాదకర వృక్షాలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో శిథిలావస్థ భవనాలు, ప్రమాదకర వృక్షాలపై చర్యలు ముమ్మరం చేసినట్లు మున్సిపల్ నగరపాలక సంస్థ అధికారులు వెల్లడించారు. నగర వ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికతో ఈ చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.