Telugu News

కోమటిరెడ్డి లేకుండానే..? అందులో నోచాన్స్

వర్కింగ్ ప్రెసిండెంట్లుగా ‘ఆ నలుగురు’

0

కొమటిరెడ్డి నో చాన్స్

== ఆయన లేకుండానే పీసీసీ కమిటీ

== తెలంగాణ పీసీసీ కమిటీని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం

== వర్కింగ్ ప్రెసిండెంట్లుగా ‘ఆ నలుగురు’

== 40మందితో ఎగ్జిక్యూటీవ్ కమిటీ

==18మందితో పొలిటికల్ ఆపైర్స్ క మిటీ

(హైదరాబాద్-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నల్గొండ ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో బందం తెగిపోయే అవకాశాలున్నాయా..? సీనియర్ నాయకుడు, ఇప్పటికి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న వెంకట్ రెడ్డిపై అదిష్టానం సీరియస్ గా  ఉందా..? ఆయనకు పదవులను ఇవ్వడం ఏఐసీసీ ఇష్టంలేదా..? అంటే నిజమేనని అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కమిటీల్లో ఆయనకు స్థానం లేకుండా చేసింది.. ఆయనతో పాటు ఎంపీలుగా గెలిచిన వారికి, ఆయనతో కలిసి పనిచేసిన వారికి  ఆ కమిటీలో స్థానం కల్పించినప్పటికి, ఆయనకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో పొమ్మనలేక పోగపెట్టినట్లే కనిపిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ పూర్తి స్థాయి కమిటీలను నియమించే పనిలో పడింది. ఇప్పటికే 26 జిల్లా కమిటీలతో పాటు పీసీసీ ప్రధాన కమిటీలు, వర్కింగ్ ప్రెసిండెంట్లు, పొలిటికల్ ఆపైర్స్ కమిటీలను నియమించిన ఏఐసీసీ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులను కూడా నియమించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని, తెలంగాణకు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. అలాగే మాణికం ఠాగూర్ చైర్మన్ గా 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించింది.

ఇది కూడా చదవండి: సరస్వతీ కటాక్షం ఉన్నా.. లక్ష్మి కటాక్షం లేక

ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, బలరాం నాయక్, జానా రెడ్డి, వంశీచంద్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని పీసీసీ కార్యదర్శులు, సభ్యులు మినహా మిగిలిన కమిటీలన్ని పూర్తిగా అయిపోయినట్లుగానే భావించాలి. ఈ కమిటీల్లో అందరికి అవకాశాలు కల్పించారు. నాలుగు జిల్లాల కమిటీలు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు కమిటీ అధ్యక్షులను నియమించింది. అయితే కొమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాత్రం ఎక్కడ అవకాశం కల్పించలేదు.. కనీసం సాధాహరణ కమిటీలోకి కూడా ఆయన్ను ఆహ్వానించకపోవడం గమనర్హం. దీంతో కొమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ అధిష్టానం పుల్ స్టాఫ్ పెడుతున్నట్లుగానే కనిపించింది. పొమ్మనలేక పొగపెట్టినట్లుగా రాష్ట్ర పదవులకు అవకాశం కల్పించకపోవడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇక కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాత్ర ముగిసినట్లేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం.. రాబోయే రోజుల్లో కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో..?

ఇది కూడా చదవండి: మహిళా కాంగ్రెస్ కు భట్టి విక్రమార్క దశదిశ