Telugu News

పాము కాటుతో మహిళ మృతి

చేగొమ్మ గ్రామంలో విషాదం

0

పాము కాటుతో మహిళ మృతి

== చేగొమ్మ గ్రామంలో విషాదం

(కూసుమంచి-విజయంన్యూస్)

పోయిలో కట్టెలకోసం వెళ్ళిన ఓ మహిళను పాము కాటువేయడంతో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కూసుమంచి మండలం చేగొమ్మ  గ్రామానికి చెందిన చేకూరి రేణుక(47)అనే మహిళ శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటల సమయాన గ్రామ సమీపంలో కట్టెల కోసం వెళ్ళింది. పెరట్లో ఉన్న కట్టెలను తీస్తుండగా పాము ఆమెను కాటు వేసింది.దీనితో రేణుక మృత్యువాత పడ్డారు.మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ పై పోటీకి నేను సిద్దం: పొంగులేటి