Telugu News

వరంగల్ లో మహిళా కండక్టర్‌కు కరోనా.. డ్యూటీలో ఉన్నప్పుడు కరోనా..?

ఓ మహిళా కండక్టర్‌కు కరోనా నిర్ధరణ అయ్యింది.

0

వరంగల్ లో మహిళా కండక్టర్‌కు కరోనా.. డ్యూటీలో ఉన్నప్పుడు కరోనా..?
ఓ మహిళా కండక్టర్‌కు కరోనా నిర్ధరణ అయ్యింది.

డ్యూటీలో ఉండగ.. సాధారణంగా పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది.. హనుమకొండ డిపోకు చెందిన బస్సు జనవరి 16న మంచిర్యాల జిల్లా చెన్నూరు బస్టాండ్​కు చేరుకుంది. ఈ బస్సులో ఓ మహిళా కండక్టర్​ విధులు నిర్వహిస్తోంది. ప్రయాణికులంతా బస్సు దిగిపోయిన తర్వాత.. డ్రైవర్‌తో కలసి బస్టాండ్‌లోనే ఆ కండక్టర్‌ టీ తాగింది. అనంతరం.. అదే బస్టాండ్​లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ నిర్ధరణ పరీక్ష కేంద్రం చూసి అటువైపు వెళ్లింది. అక్కడున్న ఏఎన్‌ఎంతో కాసేపు ముచ్చటించింది.

also read:-కూసుమంచిలో ఘనంగా సంభాని పుట్టిన రోజు వేడుకలు

టూకీగా చేయించుకుంటే పాజిటివ్​..

ఏఎన్​ఎంతో ఒంట్లో నలతగా ఉందని చెప్పగా.. కండక్టర్​కు ఊరికే చూద్దామని కొవిడ్ పరీక్ష చేసింది. అయితే.. ఈ పరీక్షలో అనుకోకుండా ఆమెకు పాజిటివ్​గా తేలింది. ఊహించని ఫలితం రావటంతో అవాక్కయిన డ్రైవర్​, కండక్టర్​ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ మహిళా కండక్టర్‌ అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లింది. అధికారుల ఆదేశాలమేరకు ప్రయాణికులకు ఎక్కించుకోకుండా.. ఖాళీ బస్సును తిరిగి హనుమకొండ డిపోకు పంపించారు.

also read :-కీచక రాఘవ ఎక్కడ: రేవంత్ రెడ్డి

ప్రయాణికుల పరిస్థితేంటీ..?
అప్పటి వరకు విధుల్లో ఉన్న కండక్టర్​కు కరోనా నిర్ధరణ కాగా.. హనుమకొండ నుంచి చెన్నూరుకు వచ్చిన ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. విధుల్లో భాగంగా అప్పటి వరకు ఆ కండక్టర్ చాలా మంది ప్రయాణికుల మధ్యలో ఉండటం.. టికెట్లు ఇవ్వటం.. డ్రైవర్​తో కలిసి టీ తాగటం.. వల్ల వాళ్లందరికీ కరోనా సోకే అవకాశం లేకపోలేదు. దీంతో.. అధికారులు ఏం చేయాలో తోచని అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్లందరు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య సిబ్బంది సూచిస్తున్నారు.