మహిళలే అధికం
ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు
ఖమ్మం జిల్లాలో 11,34,286 మంది ఓటర్లు
ఎన్ఆర్ఐ లు 68 కాగా, సర్వీస్ ఓటర్లు 675 మంది
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
ఖమ్మం జిల్లాలో మహిళమణులే అత్యధికంగా ఉన్నారు. ఖమ్మం జిల్లా ఓటర్ల జాబితాను ప్రభుత్వాధికారులు బుధవారం విడుదల చేశారు. గత కొద్ది నెలలుగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు అనేక సార్లు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు చేపట్టారు. కాగా బుధవారం పూర్తి స్థాయి ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను విడుదల చేశారు. కాగా ప్రతి నియోజకవర్గంలో మహిళలే ఎక్కువ ఉండటం గమనర్హం. అందులో మొత్తం 11,34,286 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కాగా అందులో 5,53,087 మంది పురుషులు, 5,81,137 మంది మహిళలు, 62 మంది ఇతరులు ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 3,14,005 ఓటర్లుండగా అందులో 1,51,835 మంది పురుషులు, 1,62,835 మంది మహిళలు, 48 మంది ఇతరులున్నారు.
also read :-మంత్రిని కలిసిన టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గం……
అలాగే పాలేరు నియోజకవర్గంలో మొత్తం 2,15,631 మంది ఓటర్లు ఉండగా అందులో 1,05,096 మంది పురుషులు, 1,10,531 మహిళలు, 4 ఇతరులు ఉన్నారు. మధిర నియోజకవర్గంలో మొత్తం 2,05,527 మంది ఓటర్లు ఉండగా అందులో 1,00,211 మంది పురుషులు, 1,05,311 మంది మహిళలు, 5 ఇతరులున్నారు. వైరా నియోజకవర్గంలో 1,78,385 మంది ఓటర్లు ఉండగా అందులో 87,721 పురుషులు, 90,660 మంది మహిళలు, ఒక్కరు ఇతరులు ఉన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం 2,20,738 మంది ఓటర్లు ఉండగా అందులో 1,08,937 మంది పురుషులు, 1,11,800మంది మహిళలు, ఒక్కరు ఇతరులున్నారు. అలాగే ఎన్ఆర్ఐలు కూడా ఓటును ఆన్లైన్ నమోదు చేసుకున్నారు. మొత్తం 68 మంది ఓటు హక్కును నమోదు చేసుకోగా, సర్వీస్ ఓటర్లు 675 మంది ఉన్నారు. ఈ ఓటర్ల జాబితాను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.