Telugu News

మహిళా, యువత శక్తి ఏకం అవ్వాలి: జావిద్

0

మహిళా, యువత శక్తి ఏకం అవ్వాలి: జావిద్

== కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం

== ఉద్యోగ అవకాశాలు కల్పించుకొని, పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించుకుందాం

== కుల,మత తత్వ పార్టీలను గద్దె దింపుదాం

== హత్ సే హత్ యాత్రలో పీసీసీ సభ్యులు,నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మహిళా, యువత శక్తి ఏకమై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని పిసిసి సభ్యులు, నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అన్నారు. హత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రఘునాథపాలెం మండలంలో మాంగ్య తండా, మూల గూడెం, ఎన్వీ బంజర లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి  గడపను తడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం: భట్టి విక్రమార్క

అనంతరం ఆయన మాట్లాడుతూ  కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర యావత్ దేశంలో పెనుమార్పు తీసుకువస్తుందని అందుకు నిదర్శనం కర్ణాటక ఎన్నికల విజయమే అని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ చేస్తున్నారని దాని ద్వారా నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలు చూపుతున్నారని అన్నారు. వారిద్దరి స్ఫూర్తితో మండలంలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర చేయడం జరుగుతుందని తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరికీ అందుబాటులో ఉండే నిత్యవసర వస్తులు నేడు కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని అన్నారు. సామాన్య ప్రజలు ఏం కొనాలన్నా తినాలన్న మనసారా తినలేని పరిస్థితి దేశంలో నెలకొందని అన్నారు. సామాన్య మానవుడు  మూడు పూటల కడుపు నిండా తినాలంటే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాల్సిందే అని  అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తె అన్ని రకాల వస్తువుల ధరలపై నియంత్రణ ఉంటుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కే సీ ఆర్ ప్రభుత్వం కులాల పేరుతో, కేంద్రంలో మోడీ మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశం విచ్ఛిన్నం చేయడానికి మోడీ ఆరాట పడుతుంటే అందరం ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ ఆరాట పడుతున్నారని అన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధకడు విక్రమార్కుడు: జావిద్

కాంగ్రెస్ ప్రభుత్వ మంటే సామాన్య ప్రజల ప్రభుత్వ మనే నానుడి ఎప్పటి నుండో ఉందని అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చుకునే బాధ్యత అందరిపై ఉందని ప్రతి ఒక్కరూ అందుకు కృషి చేయాలని అన్నారు. మంచిర్యాల, జడ్చర్ల సభలలో వచ్చిన అశేష జనవహినిని చూసి మోడీ, కే సి ఆర్ లకు భయం పట్టుకుందని అన్నారు.    ఈ కార్యక్రమం లో ఖమ్మం నియోజకవర్గ యూత్ డిక్లరేషన్ ఇంచార్జ్ పసుపులేటి దేవేందర్, రఘునాథపాలెం  మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీ, సత్యం బాబు, బిహెచ్ రబ్బానీ, మారం కరుణాకర్ రెడ్డి, కొంటేముక్కుల నాగేశ్వరరావు,  ఏలూరి రవికుమార్, దేవత్ శంకర్ నాయక్, బానోత్ వెంకట్రామ్, అంగోత్ వెంకన్న,బాల్య, బాలాజీ, బిచ్చు, రమేష్, రమేష్, జేత్య హరియ, ములగుడెం ఉప సర్పంచ్ బొడ రవి, గుగులోత్ బాల, యశ్వంత్, బానోత్ రమేష్, సాగర్, తది తరులు పాల్గొన్నారు……