Telugu News

ఖమ్మంలో ఉమెన్ క్రికెట్ మ్యాచ్ షూరు

== ఉమెన్ టీ20 క్రికెట్ లిగ్ 2022 క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విపీ.గౌతమ్ , పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ..

0

ఖమ్మంలో ఉమెన్ క్రికెట్ మ్యాచ్ షూరు
== ఉమెన్ టీ20 క్రికెట్ లిగ్ 2022 క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విపీ.గౌతమ్ ,
పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ..

(ఖమ్మం-విజయం న్యూస్):-
క్రికెట్ తరుణం ప్రారంభమైంది.. వేసవికాలం వచ్చిందంటే చాలు యువకులందరు క్రీడాలకు ప్రాథాన్యతనిస్తుంటారు. అందులో ముఖ్యంగా క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందుకే ఎక్కడ చూసిన వేసవికాలంలో ఎక్కువ క్రికెట్ టోర్నిలు జరుగుతుంటాయి.

అందులో భాగంగానే ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నేటి నుండి ఏప్రియల్ 10 వ తేదీ వరకు జరిగే డే&నైట్ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రల నుండి ఏనిమిది టీమ్ లుగా పాల్గొనగా మహిళ క్రికెట్ క్రీడాకారులకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

also read:-గిరిజనులను మోసం చేసింది టీఆర్ఎస్

also read:-చింతకాని దళితులకు శుభవార్త 

ఖమ్మం నగరానికి ఇదొక ఒక అద్భుత అవకాశమని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్రీడాకారులు ఖమ్మం రావటం పట్ల జిల్లా కలెక్టర్ ,పోలీస్ కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్, నేపాల్ నుంచి క్రీడాకారులు రావడాన్ని వారు స్వాగతించారు. ఖమ్మానికి ఇంత పెద్ద ఈవెంట్ తీసుకొచ్చినందుకు నిర్వహకులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ , మతీన్,సునీల్ రెడ్డి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ల ను కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ అభినందించారు.