Telugu News

మద్యం షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్టు

వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమీషనర్ డాక్టర్ శరుణ్ జోషి

0

మద్యం షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్టు

— వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమీషనర్ డాక్టర్ శరుణ్ జోషి

(వరంగల్ -విజయం న్యూస్)

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు పక్క జిల్లాలోని మద్యం షాపులతో పాటు ఫర్టిలైజర్ , కిరాణా దుకాణాలను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పర్వతగిరి పోలీసులు ఆదివారం అరెస్టు చేసారు. అరెస్టు చేసిన దొంగల నుండి 76వేల రూపాయల నగదు, రెండు కరెంటు మోటార్లు, పివిసి పైపులు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.శరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామం, టూక్య తండాకు చెందిన అజ్మీరా హేమ(వయస్సు 40), అజ్మీరా మోహన్ (వయస్సు 42),మాలోత్ వీరన్న (వయస్సు 45) వున్నారు. ఇందులో ఆజ్మీరా హేమ, అజ్మీరా మోహన్ ఇద్దరు స్నేహితులు కావడంతో పాటు ఇరువురు వ్యవసాయం చేస్తూ వుండేవారు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో నిందితులు మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. దీనితో వీరికి వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం వీరి జల్సాలకు సరిపోకపోవడంతో నిందితులు చోరీ చేసేందుకు సిద్ధపడి సూమారు 22 సంవత్సరాల క్రితమే నిందితులు ఇద్దరు కల్సి యాభైకి పైగా చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేయడంతో ఇరువురు నిందితులపై నేరాలు కోర్టులో రుజువు కావడంతో పలుమార్లు కోర్టు విధించిన జైలు శిక్షలు కూడా అనుభవించారు. నిందితులు చివరిసారిగా దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులో చోరీకి పాల్పడటంతో నిందితులను పోలీసులు అరెస్టు జైలుకు తరలించారు. తిరిగి కోద్ది రోజులకు జైలు విడుదలయిన నిందితులు ఇద్దరు తమ స్వగ్రామములోనే జీవితం గడపగా, వీరిపై పర్వతగిరి పోలీసులు డి.సి షీట్ ను తెరవడం జరిగింది.

ALSO READ :- హుజూరాబాద్‌కు 20 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలు
నిందితులు గత కొద్ది కాలంగా ఎలాంటి చోరీలకు పాల్పడకుండా తిరిగి వ్యవసాయం చేసుకునే నిందితులు తిరిగి మద్యంకు అలవాటు పడటంతో మద్యం కోసం మరోమారు చోరీలకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా గత సంవత్సరంలో నిందితులు ఒక ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి పగటి సమయాల్లో గ్రామ శివారు ప్రాంతాల్లో వుందే మద్యం షాపులను గుర్తించి రాత్రి సమయాల్లో నిందితులు మద్యం షాపు షటర్ తాళాలు పగులగొట్టి షాపులోని మద్యం సీసాలతో పాటు క్యాచ్ కౌంటర్లోని డబ్బును చోరీ చేసేవారు. ఇదే సమయంలో నిందితులు షాపులోని సిసి కెమెరాలతో పాటు, డివిఆర్‌ను దొంగిలించి వాటిని ద్వంసం చేసి బయట పడేవేసేవారు.
ఇదే రీతిలో నిందితులు ఇప్పటి వరకు మొత్తం 14 చోరీలకు పాల్పడ్డారు. ఇందులో సిద్దిపేట జిల్లాలో రెండు ఫరీలైజర్ దుకాణాలు, ఒక వైన్ షాపు, ఒక కిరాణాషాపును కలుపుకొని మొత్తం నాలుగు చోరీలకు పాల్పడగా, సంగెం పరిధిలో రెండు, ఐనవోలు, రఘునాథ్ పల్లి, దుగ్గొండి, గీసుగొండ, వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున వైన్ షాపుల్లో చోరీలకు పాల్పడి నగదు, మద్యం సీసాలను చోరీ చేయగా, పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలో నిందితులు మరో నిందితుడు మాలోత్ వీరన్నతో కల్సి రెండు మార్లు చోరీకి పాల్పడి రెండు కరెంటు మోటార్లతో పాటు, పది పివిసి పైపులను చోరీ చేయగా, సంగేం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైస్ మిల్లులో రెండు తూనికల యంత్రాలను చోరీ చేసారు. ఈ దొంగతనాలపై అప్రమత్తమైన మామూనూర్ డివిజన్ పోలీసులు డిసిపి వెంకటలక్ష్మీ మరియు మామూనూర్ ఎసిపి నరేష్ కుమార్‌లకు అందిన పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం పర్వతగిరి పోలీసులు సోమారం వద్ద వాహనతనీఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై కరెంట్ మోటారును తీసుకోస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అపి విచారించగా నిందితులు తమ నేరాలను అంగీకరించడంతో నిందితులు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ముగ్గురు నిందితులను పట్టుకోని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసిపి నరేష్ కుమార్, పర్వతగిరి సర్కిల్ ఇన్ స్పెక్టర్ విశ్వేశ్వర్, పర్వతగిరి, సంగెం, ఐనవోలు నవీన్ కుమార్, భాస్కర్ రెడ్డి, భరలతో పాటు ప్రొబెషనరీ ఎస్.ఐ నవిత, కానిస్టేబుల్ రాజు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు.\

ALSO READ :- మూడు పార్టీలు.. ముమ్మర ప్రచారం…

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*