Telugu News

ప్రజల కోసమే పనిచేస్తున్నా: కందాళ

మున్నేరు కు ఆర్సీసీ గోడ ముంపు ప్రజలకు శాశ్వత పరిష్కారం

0

ప్రజల కోసమే పనిచేస్తున్నా: కందాళ

== మున్నేరు కు ఆర్సీసీ గోడ ముంపు ప్రజలకు శాశ్వత పరిష్కారం

== 60ఏండ్ల కల నేరవేర్చిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు

== విలేకర్ల సమావేశంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి

(కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు ముంపు బాధితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని, మున్నేరు ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఆర్సీసీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం చాలా సంతోషంగా ఉందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విలేకర్లతో ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న అధిక వర్షాల వలన మున్నేరు వరద ఉద్రితి పెరిగి ఖమ్మం రూరల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు మంపునకు గురైయ్యాయయని, తద్వారా వందలాధి మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.  వరద సంభవించిన  ప్రాంతాలలో పర్యటించిన సమయంలో కఠిన పరిస్థితులను చూడాల్సి వచ్చిందని, నిరుపేదల నివాసాలు నీళ్లలో మునిగిపోయి మొత్తం తడిసిపోయి ప్రజలు తల్లాడుతున్న గడ్డు పరిస్థితులను చూశామన్నారు.

ఇది కూడా చదవండి: తుమ్మలకు కురుక్షేత్ర యుద్దమే

వరదలు వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉంటుందని, బిక్కుబిక్కుమంటూ జీవనం గడపాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు చెప్పారన్నారు. 60 ఏండ్ల నుండి ఖమ్మం రూరల్ మండలం ప్రజలు పడుతున్న బాధ గురుంచి మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి  సీఎం కేసీఆర్ కి ప్రత్యేకంగా కలిసి వివరించటం జరిగింది.. దీని గురుంచి, పూర్తి వివరాలన్నిటిని సేకరించి సీఎం ఆఫీస్ కు అందించటం జరిగిందన్నారు.  రూరల్ మండలం లో వున్నా మున్నేరు ప్రాంత ప్రజల ఇబ్బందులు గమనించి ముఖ్యమంత్రి కేసీఆర్ రిటైనింగ్ వాల్ జు నిర్మాణం కోసం 350 కోట్లు కేటాయించారని, అందుకు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు పాలేరు నియోజకవర్గ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా ఒక్క పాలేరు నియోజకవర్గం లొనే గత ఆరు నెలల కాలంలో  రూ.300 కోట్ల తో ఇంజనీరింగ్ కళాశాల, రూ.25 కోట్ల తో నర్సింగ్ కళాశాల, రూ.20 కోట్ల తో ఫిషరీస్ కళాశాల కోసం నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని స్పష్టం చేశారు. రూ.150 కోట్లలతో ఆర్అండ్ బీ పనులు, రూ.200 కోట్లు అత్యవసర రోడ్లకోసం కేటాయించారని తెలిపారు. పాలేరు నియోజకవర్గ ప్రగ్రతి కి,  ఉన్నత జీవన ప్రజాహితానికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాలేరు నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తామని, పైసల కోసం పనిచేసే వాళ్లం కాదన్నారు. ఇక్కడే పుట్టామని, ఈ గడ్డపై పెరిగామని, ఈ గడ్డ అభివద్ది కోసం తమవంతు ప్రయత్నం చేస్తానని హామినిచ్చారు. ప్రజలందరు కూడా పనులు చేసే పార్టీలను, ప్రభుత్వాలను ఆశీర్వదించాలని కోరారు.

ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?