*💥యాదాద్రికి మొదటి దాతగా కేసీఆర్*
*🔹125 కిలోల బంగారంతో విమాన గోపురం*
(యాదాద్రి-విజయం న్యూస్)
*యాదాద్రి* ఆలయం విమాన గోపురానికి తిరుమల తరహాలో బంగారు తాపడం చేయించాలని నిర్ణయించాం. ఇందుకోసం 125 కిలోల బంగారం అవసరం. యాదాద్రికి తొలి విరాళంగా మా కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం ఇస్తాం. చాలా మంది దాతలు కిలో బంగారం చొప్పున కానుకగా ఇస్తామన్నారు. చినజీయర్‌స్వామి జీయర్‌పీఠం నుంచి కిలో బంగారం ఇస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి కిలో బంగారం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిలో బంగారం ఇస్తామన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి 2కిలోల బంగారం, కావేరీ సీడ్స్ తరఫున భాస్కర్‌రావు కిలో బంగారం ఇస్తామన్నారు. యావత్ ప్రజానీకంలో యాదాద్రి తమదనే భావన రావాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రిలో రెండు రకాల డ్రైనేజీ వ్యవస్థ రావాలని సీఎం అన్నారు. వర్షా కాలంలో వరద నీరు వెళ్లేందుకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ ఉద్యోగులకు వీలైనంత త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. యాదాద్రి జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేసుకుందామని.. యాదాద్రి పుణ్యక్షేత్రంపై పరిశోధన వ్యాసాలు రావాలని సీఎం పేర్కొన్నారు.