అంగరంగ వైభవంగా యాదాద్రి ఆలయం ప్రారంభం..
--- తూర్పు రాజగోపుర కలశ సంప్రోక్షణ నిర్వహించిన మంత్రి పువ్వాడ దంపతుల దంపతులు.
అంగరంగ వైభవంగా యాదాద్రి ఆలయం ప్రారంభం..
— తూర్పు రాజగోపుర కలశ సంప్రోక్షణ నిర్వహించిన మంత్రి పువ్వాడ దంపతుల దంపతులు.
—అదృష్టం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు
– –యాదాద్రి గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది.
— మీడియాతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
(యాదాద్రి విజయం న్యూస్):-
ఇల వైకుంఠంగా, భక్తుల కొంగు భంగారంగా యాదాద్రిని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీర్చిదిద్దారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.యదద్రిలో నేడు శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయంలో శాస్రోక్తంగా, అత్యంత వైభవంగా జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో ముఖ్యమంత్రి కేసీఅర్ దంపతులతో కలిసి తాను కూడా సతీమణితో కలిసి పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం పొందిన మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడారు..
also read :-యాదాద్రి లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.
నేడు ఆ దివ్యక్షేత్ర పున:ప్రారంభ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, సహచర మంత్రులతో కలిసి పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ గొప్ప కార్యక్రమంలో దివ్య విమాన గోపురంపై సుదర్శన చక్రానికి అభిషేకం, పశ్చిమ రాజగోపురం (సప్తతల గోపురం) పై కలశాల సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించే అద్భుత అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
also read;-శాస్రోక్తంగా ముగిసిన మహాకుంభ సంప్రోక్షణ..
ఈ కాలంలో ఎంతో నిష్టతో, నిబద్దతతో ఏక కృష్ణశిలపై అద్బుత శిల్పకళా వైభవంతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించడం సీఎం కేసీఆర్ గారికే సాధ్యం అన్నారు.తెలంగాణ సాంస్కృతిక, ధార్మిక చరిత్రలో యాదాద్రి చిరస్థాయిగా నిలిచిపోతుందని, గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు.యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి అనుగ్రహం తెలంగాణ రాష్ట్రంపై, మన ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిరంతరం ఉండాలని మొక్కులు తీర్చుకున్నానన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఆలయ సంప్రోక్షణ, పున:ప్రారంభ ఘట్టాల్లో మాకు అవకాశం కలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.