Telugu News

యాదాద్రిలో బాలయ్య… కేసీఆర్ పై ప్రశంసలు

ఖమ్మం-విజయం న్యూస్

0

యాదాద్రిలో బాలయ్య… కేసీఆర్ పై ప్రశంసలు

(ఖమ్మం-విజయం న్యూస్)
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విడుదలై 25 రోజులైనా, తరువాత మరో రెండు భారీ చిత్రాలు విడుదలైనా ‘అఖండ’ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ‘అఖండ’ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విజయోత్సవాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన ‘అఖండ’ టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు. అంతేకాదు ఆయన యాదాద్రి విషయమై సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

also read :-రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికం: మాదవిరెడ్డి