Telugu News

వైరా ‘కారు’పార్టీలో కుంపటి

బలనిరూపణ దిశగా మదన్ లాల్

0

వైరా ‘కారు’పార్టీలో కుంపటి

== బలనిరూపణ దిశగా మదన్ లాల్

== వరస సమావేశాలు పెడుతున్న మాజీ ఎమ్మెల్యే

== టిక్కెట్ నాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న రాములు నాయక్

== మహిళకు మరోసారి చాన్స్ వస్తుందంటున్న చంద్రావతి

== పెద్ద ఎత్తున హాజరవుతున్నఆయన వర్గీయులు, అభిమానులు

== కారు పార్టీలో ముసలం

allso read- మద్దులపల్లి మార్కెట్ లో అక్రమాలు నిజమెంతా..?

ఆయన మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ పార్టీ నుంచి విజయం సాధించి ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరిన ఆయన స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు.. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఒంటరైయ్యారు.. ఇండిపెండింట్ అభ్యర్థిని అధికార పార్టీలోకి తీసుకున్న సీఎం కేసీఆర్, అప్పటి వరకు పార్టీలో పనిచేసిన నేతను వదిలేయడం, పార్టీలో చేరిన ఎమ్మెల్యేకు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించడంతో మాజీ ఎమ్మెల్యేకు, ఆయన వర్గీయులకు ఎన్నో అవమానాలు ఎదురైయ్యాయి.. అవకాశం వచ్చినప్పుడల్లా స్థానిక పరిస్థితులను పార్టీకి చెబుతున్నప్పటికి పట్టించుకునే నాథుడే కరువైయ్యారు.. కాగా మూడేళ్ల పాటు నిశబ్ధంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే  ఇప్పుడు నిద్ర లేచిన పులిలా ముందుకు కదులుతున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ నేత బలనిరూపణకు సిద్దమైయ్యాడు. మండలాల వారిగా సమావేశాలను నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.. తన వర్గీయులకు దిశనిర్దేశం చేస్తున్నారు.. ఆయనేందుకు సమావేశాలు పెడుతున్నారు..? అలాగే మరో వైపు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి నియోజకవర్గంలో విస్ర్తుతంగా పర్యటిస్తున్నారు. ఇంకో వైపు ఎమ్మెల్యే రాములు నాయక్ వారి కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. ముగ్గురు మూడు దారులు చూసుకుంటున్న నేపథ్యంలో ‘వైరాలో నేతల కుంపటి’ అనే షయంపై విజయం ప్రతినిధి అందించే రాజకీయ విశ్లేషణాత్మక కథనం.

ఖమ్మంప్రతినిధి, జులై 3(విజయంన్యూస్)

ఖమ్మం జిల్లాలోనే ఎస్టీ రిజర్వేషన్ కల్గిన ఏకైక నియోజకవర్గం వైరా నియోజకవర్గం. మొదటి నుంచి లంబాడీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మారిన చరిత్ర ఉంది. 2009 పునర్వీభజనలో నూతనంగా వైరా నియోజకర్గం  ఏర్పడిగా, మొదటి ఎన్నికల్లో కూటమి నుంచి సీపీఐ అభ్యర్థి బానోతు చంద్రావతి బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ పార్టీ నుంచి చంద్రావతి తిరిగి పోటీ చేయగా, వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మదన్ లాల్ విజయం సాధించారు. కానీ ఆ పార్టీలో ఎక్కువ కాలం ఉండలేదు.

allso read- మదన్ లాల్ మరో సమావేశం

ఆనాటి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మదన్ లాల్ పోటీ చేయగా, ఉమ్మడి పార్టీల కూటమి అభ్యర్థి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించిన రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండగా ఉండి రాములు నాయక్ ను గెలిపించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే రాములు నాయక్ గెలిచిన కొద్ది రోజులకే టిఆర్ఎస్ గూటిలో చేరిపోయారు. కాగా వైరా నియోజకవర్గ బాధ్యతలన్ని ఎమ్మెల్యేకు అప్పగించడంతోఅక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన మదన్ లాల్, చంద్రావతి రాజకీయ పరిస్థితి నామమాత్రంగానే మారింది. వారి వర్గీయులకు పదవుల్లో ప్రీయార్టి లేకుండా పోయింది. అనేక దఫాలుగా అవమానాలు జరిగినట్లు స్వయంగా మదన్ లాల్ వర్గీయులు చెప్పుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై గతంలో అనేక సార్లు రాష్ట్ర, జిల్లా పార్టికి, మంత్రికి వినతి చేసిన ఫలితం లేకుండా పోయిందనేది ఆ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. దీంతో చేసేది లేక మూడేళ్ల పాటు నిశబ్ధం పాటించారు.

== బలనిరూపణ చేస్తున్న మదన్ లాల్

వైరా నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టిలో కొనసాగుతున్న మదన్ లాల్  అనేక సార్లు అవమానాలు జరిగిన వాటిని ఎదుర్కోని పనిచేస్తున్నారు. మూడేళ్ల పాటు నిశబ్ధంగా ఉన్న ఆయన ఉన్నట్లుండి ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. తన వర్గీయులతో, అభిమానులతో గత ఐదు రోజుల క్రితం వైరా మండల కేంద్రంగా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశానికి పెద్ద ఎత్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలివచ్చారు. దీంతో సంతోషంతో ఉన్న మదన్ లాల్ పార్టీ మారేది లేదని, టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని చెబుతూనే వైరా టిక్కెట్ నాకే వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి  గెలిపించాలని పేర్కొన్నాడు. దీంతో ఆ వ్యాఖలు పెద్ద సంచలనంగా మారాయి. స్థానికంగా ఆ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా నాకే టిక్కెట్ వస్తుందని చెప్పడం, టిక్కెట్ వస్తే నన్ను తప్పకుండా గెలిపించాలని పార్టీ నాయకులను, కార్యకర్తలను వేడుకున్నారు. అనంతరం ఆదివారం కొణిజర్ల మండలంలో కార్యకర్తలు, నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయగా, సుమారు 5కిలోమీటర్ల దూరం పాటు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అతి కొద్ది రోజుల్లోనే మరో మండలం ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ కు గానీ, కూటమికి గాని నేనే ప్రత్యామ్నయం అన్నట్లుగా మదన్ లాల్ ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి బలనిరూపణ ద్వారా చూపిస్తున్నట్లుగానే కనిపిస్తోంది.

allso read- ఎక్సైజ్ ఉద్యోగుల దాష్టికం

== కారు పార్టీలో ముసలం

వైరా నియోజకవర్గంలో ఇప్పటి వరకు వన్ మెన్ షో చేసిన రాములు నాయక్ కు మదన్ లాల్ నిద్రపట్టకుండా చేస్తున్నారు. మండలాల వారిగా వరస సమావేశాలు నిర్వహిస్తూ వర్గపోరును మరింతగా జఠిలం చేస్తున్నారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి కూడా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇంకో వైపు ఎమ్మెల్యే రాములు నాయక్ పార్టీ టిక్కెట్ నాకేనని గంటాపథంగా చెబుతూ ఆయన వర్గీయులకు భరోసానిస్తున్నారు. ఇలా ముగ్గురు మూడు దారులు చూసుకుంటూ

బలనిరూపణ చేసుకుంటున్నారు. దీంతో వైరా నియోజకవర్గంలోని కారు పార్టీలో వర్గాలు తారస్థాయికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరిపని  వారు చేసుకుంటున్నప్పటికి అతి త్వరలోనే ఆ వర్గపోరు రోడ్డుకు చేరే అవకాశం లేకపోలేదు. దీంతో వైరా నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయోమయంలో పడిపోయారు. ఒక్కపార్టీలోనే ముగ్గురు గ్రూపులుగా విడీపోయి పనిచేస్తే ప్రత్యర్థి పార్టీలకు మేలు జరుగుతుందని పలువురు భావిస్తుండగా, ఏ గ్రూపులో తిరగాలో అర్థం గాకా పార్టీ శ్రేణులు అయోమయంలో పడిపోయారు. ఇలాగే ఉంటే పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని, ముగ్గురు కలిసి పనిచేసి, ఎవరికి టిక్కెట్ వస్తే వారికి పనిచేస్తామని హామినిచ్చి జనాల్లోకి వెళ్లాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.