టిక్కెట్ వస్తే గెలిపించండి : మదన్ లాల్
◆◆ టీఆర్ఎస్ కు హ్యాట్రిక్ తథ్యం
◆◆ కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది*
◆◆ బెదిరింపులకు టీఆర్ సైనికులు భయపడరు*
◆◆ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్*
◆◆ అభివృద్ధి ఆకాంక్ష తో పనిచేశా*
◆◆ ప్రజల మధ్య తిరుగుతా టీఆర్ ఎస్ అభివృద్ధి ధ్యేయం*
◆◆ కేసీఆర్ కేటిఆర్ తో నా ప్రాయాణం*
◆◆ దేశం తెలంగాణ సంక్షేమ పథకాలు వైపు చూస్తుంది*
◆◆ వైరా మండలం టీఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో బాణోత్ మదన్ లాల్*
(వైరా-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అని వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ అన్నారు.గురువారం వైరా లో కామిశేట్టి కళ్యాణ మండపం లో జరిగిన వైరా నియోజకవర్గం టి ఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం గారికపాడు సొసైటీ అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి అధ్యక్షుత జరిగిన సమావేశం లో బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ దేశంలో ఉన్న కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఈనాడు ప్రజా సమస్యల గురించి పరిపాలన గురించి పట్టించుకున్న దాఖలు లేవు ,ఈ రెండు పార్టీలు అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక టిఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారు అన్నారు.
Allso read:- కార్యదక్షుడు తుమ్మల…
సాగర్ జలాలు వైరా రిజర్వాయర్ లో లేకుండా ఉంటే నిపకుండ ఆంధ్రాకు తరలిస్తున్న సమయంలో ఏనుకూరు మండలం తిమ్మారావుపేట ఎస్కేప్ లోకల్ వద్ద కాలువపై రాత్రి పడుకొని వైరా రిజర్వాయర్ ను సాగర్ జాలలతో నింపితే ఆ సమయంలో నాపై కేసులు కూడా పెట్టినారని ఆయన అన్నారు, వైరా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా దృఢమైన సంకల్పం తో ముందుకు తీసుకెళ్లాలని ఎంతో కృషి చేశా అన్నారు,వైరా రిజర్వాయర్ ప్రాజెక్టును మినీ ట్యాంక్ బండగ మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను నీటి పారుదల అప్పటి మంత్రి హరీష్ రావు కు సమస్యను వివరించి పోరాడి మినీ ట్యాంక్ పండగ మార్చుకోవడం జరిగిందని అన్నారు.అప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రంలో లేదు విడిపోయిన తర్వాత పార్టీ కనుమరుగయింది, ఆ సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి నేను అడిగినా నియోజకవర్గం అభివృద్ధి కావాలని అడగడంతోనే వైరా నియోజకవర్గానికి అంతర్గత రోడ్లు లింకు రోడ్లు నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు ,వైరా మున్సిపాలిటీ ఏర్పాటు కావడానికి జనాభా ప్రాతిపదికన జనాభా సంఖ్య తక్కువగా ఉండటంతో కొనిజర్ల మండలంలోని దిద్దుపూడి లాలాపురం పల్లిపాడు గుండ్రతి మడుగు గ్రామాలను కలిపి వైరా మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు, నూతన మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు నిధులు తేవడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు నిర్మాణం కోసం అప్పుడు నిధులు తీసుకుని రావడం జరిగింది అని గుర్తు చేశారు.
Allso read:- ఖమ్మంలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం
ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రంలో సాగునీరు అందించడం కోసం కాలేశ్వరం ప్రాజెక్టుతో పాటు మరెన్నో ప్రాజెక్టులు ను నిర్మించి తెలంగాణ రాష్ట్రానికి సాగునూరు అందిస్తూ సస్యశ్యామలంగా ఉంచుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ,రైతుబంధు పేరుతో రైతుల కోసం పెట్టుబడి కోసం ఎకరానికి 5000 రూపాయల డబ్బులను అందిస్తున్న నాయకుడు కేసీఆర్ అన్నారు,కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రని ఇబ్బంది పెట్టినా రైతుల ధాన్యం కొనుగోలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది, ప్రజా పాలన కోసం పాటుపడే టీఆర్ ఎస్ పాట్టి ఎవరికి భయపడదు అన్నారు,
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటిఆర్ సారథ్యంలో నేను ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను టిఆర్ఎస్ పార్టీలో తిరుగుతాను ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధి ధ్యేయం గా ముందు కు పొతను తప్ప ఏ ఇతర పార్టీల వైపు చూడను చూడబోను అని మదన్ లాల్ అన్నారు, దేశ చరిత్రలు ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో మహిళలు త్రాగు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు ,ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో లో మరింత అభివృద్ధి జరుగుతుంది అన్నారు, ఈ కార్యక్రమంలో కొండకుడెం సర్పంచ్ దోంతేబోయనయిన శ్రీనివాసరావు, తాడిపూడి సర్పంచ్ భట్ట భద్రయ్య సొసైటీ డైరెక్టర్ దోంతేబొయన వెంకటేశ్వర్లు ,ఖానాపురం ఉప సర్పంచ్ భూపతి రెడ్డి గొల్లపూడి హరినాథ్ బాబు మేదర మేట్ల శ్రీనివాస్ రావు మాదినేని ప్రసాద్ పరుచూరి రామారావు దొంతేబోయన చింతయ్య మాచర్ల ఆదినారాయణ భూమాత కృష్ణమూర్తి వనమా చిన్ని ఇరుపర్శపు భాస్కరరావు విజయ్ రాజు మేడ రాంబాబు,మేడ శ్రీనివాస్ పారుపల్లి నాగం,పరుచూరి రామారావు శేట్టిపల్లి శ్రీనివాస్ రావు,పునాటి వెంకటేశ్వరరావు అయనల కనక రత్నం కొసురి రామకృష్ణ,గుజ్జర్లపుడి దేవరాజు కొత్త వెంకటేశ్వరరావు ఆదూరి ప్రేమ్ కుమార్ దోంతేబొయన గోపి వజినేపల్లి చక్రవర్తి మొల దుర్గాప్రసాద్ యండ్రతి గోపాల్ రావు పణితి శంతయ్య బోసు వీరాబాబు యదవ్ అనుమోలు సైదులు పుప్పల అనంతరమయ్య,రంగ సత్యనారాయణ నల్లమొతు లక్ష్మి నారాయణ అకుల రాజు రమ క్రిష్ణా మేండెం రాజు మదర్ వల్లపు రాము మిట్టపల్లి శివ దొంతేబొయన వెంకట నారాయణ ఓంకార్ నారాపొగు కీరణ్ వీలసాగరం నరేష్ క్రిష్ణారెడ్డి పుల్లారెడ్డి బత్తుల వెంకటేష్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు