Telugu News

బిగ్ న్యూస్.. పల్లిపాడు వద్ద ఘోర ప్రమాదం

ఇద్దరు యువకులు మృతి.. మరోకరి పరిస్థితి విషమం

0

 

పల్లిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

== అక్కడిక్కడే  చనిపోయిన ఇద్దరు యువకులు

== మరోకరి పరిస్థితి విషమం..ఖమ్మం ఆసుపత్రికి తరలింపు

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 6(విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది.. మోటర్ సైకిల్ ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించగా, మరోక యువకుడికి తీవ్రగాయాలైయ్యాయి. ఆయన్ను 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పల్లిపాడు వద్ద విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కొణిజర్ల మండలంలోని పెద్దగోపతికి చెందిన ముగ్గురు యువకులు మోటర్ సైకిళ్లపై  వైరా నుంచి ఖమ్మం వైపు వెళ్తున్నారు. కాగా మార్గం మధ్యలోని పల్లిపాడు వద్ద ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడేమరణించారు. వారి శరీరంపై లారీ దూసుకపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో ఆయన్ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి 108 వాహనం ద్వారా తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పల్లిపాడు వద్ద విషాదం నెలకొంది. ముగ్గురు యువకులు పెద్దగోపతి గ్రామానికి చెందిన తుమ్మల పల్లి గోపి, సంపెట సాయి ఇద్దరు మరణించగా,  కొమ్ము గోపి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.  ఈ సంఘటన చాలా విషాదకరంగా ఉంది.

ఇది కూడా చదవండి : ఆయన దారేటు..?