Telugu News

ప్రతీ పేదవాని గోడు విన్న యాత్ర,జోడో యాత్ర: కోరం

రాబోయేది పేదల సంక్షేమ ప్రభుత్వమే

0

ప్రతీ పేదవాని గోడు విన్న యాత్ర,జోడో యాత్ర: కోరం

== భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ*

== ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య*

== మాధో అడుగు,మీదో అడుగు అంటూ అశేష అభిమానుల కోలాహలంతో ముగిసిన జోడో యాత్ర*

== రాహుల్ రాకతో రాష్ట్రంలో జోష్ లో కాంగ్రెస్ శ్రేణులు*

== రాబోయేది పేదల సంక్షేమ ప్రభుత్వమే*

(ఇల్లందు-విజయం న్యూస్)
ఏఐసీసీ అగ్రనేత  రాహుల్ గాంధీ  కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు మేర సాగిన భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళ నాడులో ప్రారంభమై కేరళ,కర్ణాటక,తమిళనాడు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణా,మహారాష్ట్ర,మధ్య ప్రదేశ్,రాజస్థాన్,ఉత్తరప్రదేశ్,హర్యానా, పంజాబ్,చండీగఢ్,మీదుగా జమ్ము కాశ్మీర్ వరకు కేవలం ఐదు నెలల్లో విజయవంతంగా ముగిసిందని అన్నారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ ను అధికారంలోకి తీసురావాలనే బలం పెరిగింది : పొంగులేటి 

యాత్రలో ప్రధాని మోడీ ప్రభుత్వం చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేస్తూ,దేశంలో పేద ప్రజలు,బడుగు బలహీనర్గాల ప్రజలు పడుతున్న గోసలు ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగేలా మీదో అడుగు మాదో అడుగు అంటూ శ్రీ.రాహుల్ గాంధీ  చేపట్టిన యాత్రకు కనీ వినీ ఎరుగని రీతిలో విశేష స్పందన లభించిందన్నారు. భారత్ జోడో యాత్ర ముగించుకుని సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి కొనసాగింపుగా ఏఐసీసీ కమిటీ పిలుపు మేరకు నేడు ఇల్లందు పట్టణ,మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్  కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి గోవింద్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో నాయకులతో కలిసి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- తుమ్మల  చేరికు అప్పుడే..? 

ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డా డానియేలు,పులి సైదులు,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు డా,,జీ.రవి,పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్,మైనార్టీ సెల్ అధ్యక్షులు మసూద్,ఎస్టీ సెల్ అధ్యక్షులు నాగరాజు,బీ.సీ సెల్ అధ్యక్షులు నాగరాజు,పట్టణ ఉపాధ్యక్షుడు హైజాక్, ఐఎన్టియూసీ మహబూబ్,సీనియర్ నాయకులు భద్రం,వాసుదేవ్,ఇమామ్,జ్జవెంకన్న,సైదు మియా,ఈసం లక్ష్మణ్,మహిళా నాయకురాళ్ళు బానోత్ శారద, సన్నాఇల సరస్వతి,చెంచమ్మ,సునిత,పద్మావతి,మండల సర్పంచులు పాయం స్వాతి, కల్తీ పద్మ, పాయం లలిత, తాటి చుక్కమ్మ,ఎంపీటీసీలు మండల రాము,పూనెం సురేందర్,పాయం కృష్ణప్రసాద్,తాటి యశోద,ఉప సర్పంచులు కుర్రా అరుణ,తాటి రాంబాబు, నాయకులు మడుగు సాంబమూర్తి,చిల్లా శ్రీనివాస రావు,

ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?

బోళ్ళ సూర్యం,నంద కిషోర్, హరినాథ్ బాబు,సతీష్,ఎరసంగి వెంకన్న, తాటి బిక్షం, ముక్తి కృష్ణ,సువర్ణపాక సత్యనారాయణ,కిన్నెర నర్సయ్య, చెన్నూరి శ్రీను,చెన్నూరి రమేష్,గుగ్లోత్ నాగార్జున,ఊరుగొండ ధనుంజయ్, కాకటి భార్గవ్,ఆముదాల ప్రసాద్, రావూరి సతీష్,ప్రసన్న కుమార్ యాదవ్, పాయం ఆంజనేయులు,పత్తి రంజిత్,కుంటా రాజు,అజ్జు, సప్పిడి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.