Telugu News

తక్షణ సాయం నా నైజం… పొంగులేటి

ఇల్లందులో పోటెత్తిన అభిమానం

0

తక్షణ సాయం నా నైజం… పొంగులేటి
-ఇల్లందులో పోటెత్తిన అభిమానం
-బైక్ ర్యాలీలో పాల్గొన్న పొంగులేటి
-కార్యకర్తల కుటుంబాలకు ఓదార్పు
-పలు కుటుంబాలకు ఆర్ధిక సహాయం
-పట్టణంలో విస్తృతంగా పర్యటించిన పొంగులేటి, కోరం

(ఇల్లందు- విజయంన్యూస్)

తక్షణ సాయం నా నైజమని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి
శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇల్లందు పట్టణ కేంద్రంలోని బొజ్జయిగూడెం సమ్మక్క-సారక్క గద్దె నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీలో కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యతో కలసి పాల్గొన్నారు. అనంతరం ఇల్లందు పట్టణ కేంద్రంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ ఎటువంటి పదవిలేకున్నా ప్రజల మనిషిగా నన్ను ఆదరిస్తున్న తీరును చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపారు.

allso read- భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

ఇదే ఆదరణ రాబోవు రోజుల్లోనూ ప్రజలనుంచి కోరుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని నన్ను నమ్ముకుని ఉన్నా ప్రతిఒక్క కార్యకర్తకు, నాయకుడికి, అభిమానికి సరైన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పర్యటనలో ఇల్లందు పట్టణలంలోని అన్ని ప్రాంతాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ఇటీవల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారి ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థికసాయం అందజేశారు. ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా ఉ ంటానని చెబుతూ తక్షణం స్పందించి ఆర్థికసాయం చేశారు. వీటితో పాటు గ్రామాల్లోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు. పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. ఈ పర్యటనలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

allso read- ‘ఇంజక్షన్’ హత్య లో పెద్ద ట్విస్ట్