Telugu News

రోడ్డేక్కిన కాంగ్రెస్ పోరు.. ఇందిరమ్మ వర్థంతి సాక్షిగా బయటపడ్డ వర్గపోరు

నువ్వా..నేనా అంటూ తోపులాడుకున్న నేతలు

0

రోడ్డెక్కిన కాంగ్రెస్ రచ్చ…. _

— ఇందిరా గాంధీ వర్ధంతి సాక్షిగా బయటపడ్డ వర్గ పోరు

— నువ్వా,నేనా అంటు  తోపులాట

(ఇల్లందు-విజయం న్యూస్)

ఇన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిన కాంగ్రెస్ వర్గ పొరు నేడు రోడ్డున పడింది.పట్టణ నడిబొడ్డున ఇరువర్గాలు ఒకరి పై ఒకరు దుర్బాషలుడుతు కాంగ్రెస్ పార్టీ పరువును బజారు కు ఇడ్చారు.పట్టణ నూతన కమిటీ ,మాజీ కమిటీ సభ్యులు ఇందిరా గాంధీ వర్ధంతి సాక్షిగా పార్టీ ఖ్యాతిని అప్రతిష్టపాలు చేశారని చెప్పొచ్చు.ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ మాజీ అధ్యక్షుడు, టీ పి సి సి మెంబర్ ఎస్ కే జానీ జగదాంబ సెంటర్ లోని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, వై యస్ ఆర్ విగ్రహాలతో పాటు ఇందిరా నగర్ లోని ఇందిరా గాంధీ విగ్రహానికి కొత్త మెరుగులు దిద్దారు. ఈ క్రమంలో ఆదివారం ముందుగా జగదాంబ సెంటర్ లోని మూడు విగ్రహాలను ఆవిష్కరించి, అనంతరం ఇందిరా నగర్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పట్టణ నూతన కమిటీ అధ్వర్యంలో మాజీ కమిటీ సభ్యులకు తెలపకుండనే ఇందిరా నగర్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పట్టణ అధ్యక్షుడు డానియల్ ,మండల అధ్యక్షులు పులి సైదులు అధ్వర్యంలో నివాళులు అర్పిస్తున్నరాని విషయం తెలుసుకున్న జానీ వర్గీయులు ఇందిరా నగర్ కు వెళ్లి వర్ధంతి వేడుకలను నిలిపివేసి ముందుగా జగదాంబ సెంటర్ లో వేడుకలను నిర్వహించి అనంతరం ఇందిరా నగర్లో అందరం కలసి పాల్గొందమని డానియల్ వర్గీయులకు చెప్పారు.

ఈ క్రమంలోనే మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య తోపలాటలా వరకు వెళ్ళింది. ఈ క్రమంలో పోశం వెంకటేశ్వర్లు,డానియల్ వర్గీయుల మధ్య అంతు చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుకున్నారు.ఒకానొక సమయంలో ఇరు వర్గీయులు కొట్టు కునేందుకు సైతం సిద్దమయిన సమయంలో పలువురు పార్టీ నాయకులు వారిని అక్కడ నుంచి పంపించివేయడం జరిగింది .ఇల్లందు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు పట్టం కడుతు వస్తున్నారు .ఇప్పుడిప్పుడే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ ని రాష్టం లో కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తీసుకు వచ్చేందుకు శత విధాలుగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇల్లందు లో నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్ పార్టీ లో వున్నటువంటి వర్గ పోరు రోడ్డున పడడంతో పార్టీ సీనియర్ నాయకులు ,అభిమానులు ,ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ ఖ్యాతిని ,ప్రతిష్టను పెంచాల్సిన నాయకులే పార్టీ పరువును బజారు నా వేయడం ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ కీర్తి నీ అపాహస్యం చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.ఇదే వర్గ పోరు భవిషత్తు లో కొనసాగితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పక తప్పదని పలు రాజకీయ పార్టీలు గుస గుస లాడుకుంటున్నయి అని ఆరోపణలు లేకపోలేదు. ఈ వర్గ పోరు పై అది నాయకత్వం స్పందించి ఇరువర్గాల నాయకులను ఏక తాటి పైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

also read:- ఏసీబికి చెక్కిన సబ్ ఇంజనీర్ .2వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికి