Telugu News

ఇల్లందుకు పీసీసీ మెంబర్లుగా వీరేనా..?

ఒకరికి కోఆప్షన్ వచ్చే అవకాశం..?

0

ఇల్లందుకు పీసీసీ మెంబర్లుగా వీరేనా..?

== ఒకరికి కోఆప్షన్ వచ్చే అవకాశం..?

== 17న ఓటింగ్ కు హాజరుకానున్న మెంబర్లు

ఖమ్మంప్రతినిధి, అక్టోబర్ 14(విజయంన్యూస్)

పీసీసీ మెంబర్ల నియామకం దాదాపుగా పూర్తైయ్యినట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా పీసీసీ మెంబర్ల నియామకం విషయంలో ఇటు పీసీసీ, అటు ఏఐసీసీ తర్జన భర్జన పడుతున్న పరిస్థితి ఉంది. ఒక్కోక్క నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున అంటే ఏ బ్లాక్, భీబ్లాక్ ఇంచార్జ్ లను మాత్రమే పీసీసీ మెంబర్లుగా నియమించడం అచారంగా వస్తుంది. జిల్లాకు ఒక్కటో, రెండో కోఆప్షన్ మెంబర్లుగా అవకాశం ఇస్తారు. కానీ ఈ సారి మాత్రం ఇష్టానుసారంగా ప్రకటించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున విమ్మర్శలు రావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: ఉమ్మడి ఖమ్మం జిల్లా పీసీసీ మెంబర్లు వీరే..?

దీంతో రంగంలోకి దిగిన కేసీ. వేణుగోపాల్ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పన పీసీసీ మెంబర్లను ఎంపిక చేశారు. కాగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు పీసీసీ మెంబర్లను ఎంపిక చేయగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంకు పీసీసీ మెంబర్లను ఎంపిక చేసే విషయంలో పీసీసీ ఆలోచనలో పడ్డారు. ఇల్లందు నియోజకవర్గం మూడు జిల్లాలో ఉండటం, ఆయా జిల్లాలకు సంబంధించిన నాయకత్వం ఫిర్యాదులు చేసుకోవడం పట్ల ఆ నియోజకవర్గ పీసీసీ మెంబర్ల నియామకాన్ని పునరాలోచించారు. ఆ నియోజకవర్గంలో డాక్టర్ రవి, చీమల, రాంరెడ్డి గోపాల్ రెడ్డి తదితర నాయకత్వానికి ముందుగా పీసీసీ మెంబర్లుగా నియమించినట్లు తెలిసినప్పటికి ఆ తరువాత ఇద్దరు పేర్లను ఖారారు చేసినట్లు తెలుస్తోంది.

== పీసీసీ మెంబర్లు వీరేనా..?

ఇల్లందు నియోజకవర్గానికి పీసీసీ మెంబర్లుగా ఇద్దరు పేర్లను అదిష్టానం ఖారారు చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎడ్ల శ్రీరామ్ యాదవ్, మహుబూబాబాద్ జిల్లా కు చెందిన వెన్నం శ్రీకాంత్ రెడ్డి పేర్లను ఖారారు చేసినట్లు సమాచారం. అయితే పీసీసీ కోఆప్షన్ సభ్యుడిగా రాష్ట్రానికి 32మందిని తీసుకునే అవకాశం ఉండగా ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించిన ఓ నాయకుడికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ పేర్లు ఇప్పటి వరకు అధికారికంగా

ప్రకటించకపోయినప్పటికి నాయకుల సమాచారం మేరకు ఇల్లందు నియోజకవర్గం వారు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మహుబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిని ఇల్లందు నియోజకవర్గానికి ఎలా నియమిస్తారని ఆరోపిస్తున్నారు. పీసీసీ  మెంబర్లుగా ఎంపికైన వీరందరు ఈనెల 17న ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నికకు హాజరై ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం పట్టణంలో రెచ్చిపోతున్న దొంగలు