అమ్మగా ఇల్లందు ఎమ్మెల్యే
** పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హరిప్రియనాయక్
** ఇల్లందులోని రాహుస్ ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు.. అభినందించిన మంత్రి, ఎమ్మెల్యేలు
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ దసరా రోజున పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇల్లందులోని రాహుస్ ప్రవేట్ ఆసుపత్రిలో తన కాన్పు ను చేయించుకున్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. ఆసుపత్రిలో డెలివరీ అయినా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తల్లి బిడ్డ ఆరోగ్యం పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు..
ఇది కూడా చదవండి –టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్