Telugu News

క్యాబిన్ కింద ఇరుకున్న క్లీనర్…ప్రాణాలతో బయట పడ్డ డ్రైవర్

అదుపు తప్పి బోల్తా పడిన బొగ్గు టిప్పర్

0

అదుపు తప్పి బోల్తా పడిన బొగ్గు టిప్పర్

ప్రాణాలతో బయట పడ్డ డ్రైవర్

క్యాబిన్ కింద ఇరుకున్న క్లీనర్

రెండు గంటలు శ్రమించి కాపాడిన టేకులపల్లి ఎస్ ఐ రాజ్ కుమార్,స్థానికులు ..

(టేకులపల్లి-విజయం న్యూస్)

కోయాగుడెం ఓపెన్ కాస్ట్ నుండి ఇల్లందు బొగ్గు రవాణా చేసే టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయట పడిన డ్రైవర్ పరారీలో ఉండగా టిప్పర్ క్యాబిన్ కింద ఇరుకున్నా క్లీనర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.వివరాల్లోకి వెళితే గురువారం కే ఓ సి నుంచి ఇల్లందు కు బొగ్గు లోడు తో వెళ్తున్న టిప్పర్ ఆంజనేయ పాలెం దాటిన తర్వాత సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో ,పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రెళ్ళ ప్రశాంత్ , ప్రాణాలతో బయటపడి పరారీలో ఉన్నాడు.క్లీనర్ సాయి మాత్రం క్యాబిన్ కింద ఇరుక్కొని రెండు గంటలు నరకయాతన అనుభవించాడు.విషయం తెలుసుకున్న టేకులపల్లి ఎస్ ఐ ఇమ్మడి రాజ్ కుమార్ స్థానికుల సహాయంతో క్లీనర్ ను బయటకు తీయడం జరిగింది .వెంటనే అంబులెన్స్ లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎస్ ఐ తెలిపారు .డ్రైవర్,క్లీనర్ ఇల్లందు మండలం రొంపెడు గ్రామానికి చెందిన వారే. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.పోలీసుల తో పాటు గ్రామ యువత ,ట్రాక్టర్ యాజమాన్యాలు,స్థానిక యువత సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

అందుకు సంబంధించిన పోటోలు ఇవ్వే

ALSO READ: – మంత్రి పువ్వాడకు యువనేత ప్రశంస