Telugu News

ఆపద్బాంధవుడు హరికృష్ణ

మానవత్వం చాటుకున్న మంచి మనిషి

0

ఆపద్బాంధవుడు  హరికృష్ణ.

== మానవత్వం చాటుకున్న మంచి మనిషి

== చేసేది చిరు వ్యాపారి సేవలో పెద్దమనసు

(ఇల్లెందు-విజయంన్యూస్)

ఆయన ఒక సాధారణ కూరగాయల వ్యాపారి తాను సంపాదించిన దాంట్లో నిరుపేదలకు సహాయం చేయాలని తపన నిలువెత్తన ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా తనకు తోచిన సహాయాన్ని పేదలకు నిరుపేదలకు అందిస్తూ వస్తున్నారు ఇప్పటికి చాలామంది ఆయనను ఆపద్బాంధవుడిగా దేవుడిగా చూస్తున్నారు కరోనా విపత్కర కాలంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ మొత్తానికి ఉచితంగా కూరగాయలు అనేకసార్లు పంపిణీ చేసిన ఘన చరిత్ర ఆయనదే .

Allso read:- ఇల్లందులో మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?

విజయం ఇల్లెందు: ఇల్లందు పట్టణము కు చెందిన కూరగాయల వ్యాపారి బి ఆర్ ఎస్ ఉపాధ్యక్షుడు  పెండ్యాల హరికృష్ణ తనకు ఉన్నదాంట్లో పేదలకు పంచుతూ ఆదుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది పేద, యువత ,వృద్ధులు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి వారి హృదయాల్లో సుస్థిర స్థానమును సంపాదించుకున్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యం ఖర్చుల నిమిత్త తన వంతు ఆర్థిక సహాయం చేశారు .మృతి చెందిన కుటుంబాలకు పరామర్శించడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని అందజేసి వారికి భరోసా కల్పించారు. కరోనా విపత్కరకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన మిత్ర బృందంతో కలిసి వందలాది కుటుంబాలకు నిత్యవసర సరుకులతో పాటు కూరగాయలను ఉచితంగా పంపిణీ చేసి ఆదుకున్నారు.

Allso read:- ఇల్లెందులో హీటెక్కిన రాజకీయం

ఇల్లందు పట్టణంలో పెండ్యాల హరికృష్ణ అంటే తెలియని వారు ఉండరు. సహాయం కోసం తన వద్దకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో వెనక్కి పంపిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. నిస్వార్ధంగా తాను చేసే సేవ కార్యక్రమాలను ప్రజలు ఎందరో అభినందిస్తున్నారు.   సర్కార్ విద్యాసంస్థల్లో స్టడీ మెటీరియల్ కొనుగోలుకు ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు . రాజకీయంలోనూ తాను నివసించే వార్డులో తన అభిమానులు ఎందరో ఉన్నారు . ఆయన కుటుంబానికి వార్డులో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల రెండు రోజుల క్రితం కాలేయ వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైన ఆటో డ్రైవర్ ఆలూరు హరి కుమార్ మాదిగ కి రూ లమ్మ 5000 ఆర్థిక సాయం చేసి సేవ దృక్పథాన్ని చాటుకున్నాడు.