ఏన్కూర్ లో భారీ వర్షం.
== పిడుగుపాటుకు యువకుడు మృతి.
ఏన్కూరు, జూన్ 19 ( విజయం న్యూస్)
ఏన్కూరు మండలం లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు పిడుగులు శబ్దాలతో భారీ వర్షం కురిసింది. సుమారు గంట సేపు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పిడుగుల శబ్దాలతో ప్రజలు భయాందోళన చెందారు. జన్నారం గ్రామ సమీపంలో ఓ రైతు పొలంలో పనిచేస్తున్న గుడిమెట్ల వేణు అనే యువకుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. మరి కొన్ని చోట్ల కూడా పిడుగు పడినట్లు సమాచారం గత కొన్ని రోజులుగా మండే ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలు ఆదివారం కురిసిన భారీ వర్షంతో ఊరట చెందారు.
allso read- ఒక ఊరి నుంచి 21మంది ఎంపిక