Telugu News

అన్న ఇంటి ముందు చెల్లి మందుడబ్బాతో నిరసన

అప్పు చెల్లించడం లేదని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన చెల్లి

0

అన్న ఇంటి ముందు చెల్లి మందుడబ్బాతో నిరసన

— తీసుకున్న అప్పు ఎగకొట్టడంతో పురుగుల మందు డబ్బాతో సోదరుడి ఇంటి ముందు బాధితురాలి ధర్నా!

— ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్న స్థానికులు
— న్యాయం చేయాలంటూ వేడుకొలు

(ఎర్రుపాలెం- విజయం న్యూస్)

మండలంలోని జమలాపురం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి పద్మ తన వద్ద తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా బెదిరించడంతో అప్పుతీసుకున్న వ్యక్తి ఇంటిముందు పురుగు మందు డబ్బాతో బుధవారం ఎండలో మహిళ ధర్నాకు దిగింది. ఇదే గ్రామానికి చెందిన స్వయానా తన సోదరుడి కుమార్తె వివాహానికి అవసరం కోసం తన సోదరుని ఇంటిని స్వాధీన అగ్రిమెంట్ చేయించుకొని అప్పుగా రూ.3క్షల రూపాయలను ఇచ్చింది. తను కూడా ఆ డబ్బును వేరొకరి దగ్గర అప్పుగా తెచ్చి గత సంవత్సరం మే నాల్గవ తారీఖున ఇచ్చానని, గడువు పూర్తవ్వడంతో డబ్బులు అడగగా ఇస్తాను అని చెప్పి నాలుగు నెలలుగా తిప్పించుకొని ఇప్పుడు నేను ఇవ్వను నీకు దిక్కున్న చోట చెప్పుకో అని దిక్కారంగా మాట్లాడుతూ డబ్బులు ఇవ్వనని బెదిరిస్తుండడంతో పోలీసులను ఆశ్రయించింది.  అయినా ఉపయోగం లేకపోవడంతో, దిక్కుతోచని పరిస్థితులలో తన సోదరుని ఇంటి ముందు ధర్నా చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకి అప్పుగా ఇచ్చిన వారు తనపై వత్తిడి తెస్తున్నారని, తను భర్తలేని ఒంటరి దానినని, సోదరుని మీద ప్రేమతో శక్తికి మించి అప్పు తెచ్చి ఇస్తే ఇప్పుడు మొండి చెయ్యి చూపిస్తున్నాడని,తనకి న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆత్మహత్య ప్రయత్నం చేయబోగా ఇరుగు పొరుగు వారు ఆపడంతో పురుగుమందు సేవించ కుండా ఆగిపోయింది. ధర్నా చేసే సమయంలో ఇంటివద్ద ఎవరు అందుబాటులో లేకుండా తాళంవేసి ఉంది.

ఇది కూడా చూడండి : ‌- చండ్రుగొండ సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారీ

ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? లెటెస్ట్ న్యూస్, ట్రెండింగ్ న్యూస్ చూడాలనుకుంటున్నారా..? అయితే మీ స్క్రీన్ పై కనిపిస్తున్న ‘గంట’ సింబల్ ను నొక్కండి.. ఆ తరువాత ఆల్ అని నొక్కండి.. ఎప్పటికప్పటి లెటెస్ట్ న్యూస్.. మా వార్త.. మీ ముంగింట..? ఉంటుంది.