Telugu News

ఇల్లెందులో గంజాయి స్మగ్లర్ల హల్ చల్

ముగ్గురు అరెస్ట్.. విచారణ చేస్తున్న పోలీసులు

0

ఇల్లెందులో గంజాయి స్మగ్లర్ల హల్ చల్

** ముగ్గురు అరెస్ట్.. విచారణ చేస్తున్న పోలీసులు

(ఇల్లెందు-విజయం న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో గంజాయి స్మగ్లర్లు హల్చల్ చేశారు.
భద్రాచలం నుంచి హైదరాబాద్ కు కారులో గంజాయిని తరలిస్తు కారుతో బీభత్సం సృష్టించిన ముగ్గురు వ్యక్తులను పక్కా సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సుభాష్ నగర్ వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ బాబా నిలిపేందుకు ప్రయత్నించాడు. దీంతో స్మగ్లర్లు బాబాను ఢీకొని వేగంగా ఇల్లందు పట్టణంలోకి దూసుకెళ్లారు.

Allso read-సిని గాడ్ పాధర్ విశ్వనాథ్ కన్నుమూత

ఇల్లందు పట్టణం రైల్వే బ్రిడ్జి వద్ద అదుపుతప్పి డివైడెడ్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు నిలిచిపోయింది. కారులో గంజాయి ఉండటంతో స్థానికులు ముగ్గురు వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్, పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారు.