Telugu News

కమాన్ గుసగుస.. ?! 

ఇల్లెందులో సీక్రెట్ రాజకీయం

0

కమాన్ గుసగుస.. ?!           

== ఇల్లెందులో సీక్రెట్ రాజకీయం.      

== ఇటీవల శీనన్నను కలిసిన బీఆర్ఎస్ నాయకులు.                     

== షర్మిలకు టచ్ లో మరికొందరు

(ఇల్లెందు- విజయంన్యూస్):

ఇల్లెందు లో అన్యోన్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకు గులాబీ పార్టీకి నాయకులు షాక్ ఇస్తున్నారు. కారు దిగేందుకు పరోక్షంగా చాలామంది సన్నద్ధమవుతున్నారంటూ తెలుస్తుంది. ఇటీవల కీలక టిఆర్ఎస్ నాయకులు  శ్రీనివాస్ రెడ్డి, షర్మిలను కలిసినట్లు నియోజవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంపై ప్రత్యేక కథనం…

Allso read:- ఇల్లందులో మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?

ఇల్లెందు రాజకీయాల్లో వాడి వేడి రగులుకుంటుంది బీఆర్ఎస్  పాత్ర పోషించే నాయకులు  అసంతృప్తి నాయకుడు శ్రీనివాస్ రెడ్డికి చాలామంది టచ్ లో ఉన్నట్లు ఇల్లెందు నియోజకవర్గ ప్రచారం జరుగుతుంది. మరికొందరు

 టి వై ఎస్ ఆర్ సి పి షర్మిలకు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కీలక  బి ఆర్ ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిని కలిసినట్టు నియోజవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందుకు కారణాలు తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనప్పటికీ ఇల్లందు నియోజకవర్గంలో పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి . రానున్న రెండు మూడు నెలలు మరింత తీవ్ర ధూపం దాల్చే అవకాశం ఉంది. శ్రీనివాస్ రెడ్డి టీ వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్ ఎందుకు ముగ్గు చూపుతున్నారనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

@ – ” గులాబీ నుండి మరికొందరు”

మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకు వెళుతున్నట్టు జోరుగా చర్చ జరుగుతుంది. ఇల్లెందు నియోజకవర్గంలో ఆయనకు బలమైన కేడర్ ఉంది .

Allso read:- ఆపద్బాంధవుడు హరికృష్ణ

ఆయన నమ్ముకున్న వ్యక్తి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు ఎటు వైపు వెళ్తే అటువైపు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాడు. ఎన్నికలు దగ్గర పడడంతో రాజకీయ వేడి ఇల్లెందు నియోజకవర్గంలో రగులుకుంటుంది

@ – ” శ్రీనివాస్ రెడ్డి ఎటువైపు “…

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ లో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలు దగ్గర పడడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది ఆయన నమ్ముకున్న కొంతమంది నేతలు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ తను నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం చేయడని అందరు భావిస్తున్నారు. ఈ రాజకీయ చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది

@ – “మరో రెండు నెలలు భవిత్వం”..?      

రాజకీయ మార్పులు మరో రెండు నెలలు పూర్తిగా మారనున్నాయి. కీలక నేతలు బీఆర్ఎస్ ను అంటి పెట్టుకుని ఉంటున్నారు తప్ప చాలామంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నటిస్తున్నారు. అసెంబ్లీ రద్దు చేస్తే పరిణామములు పూర్తిగా మారనున్నాయి.

Allso read:- శీనన్న ఆ గట్టునా..? ఈ గట్టునా..?

అదేవిధంగా చాలామంది బీఆర్ఎస్ నేతలు ఏ నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు. రెండు మూడు నెలలు తదుపరి ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ కోవలేనే ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది నియోజకవర్గ నాయకులు కాచుకుని కూర్చున్నారు.

@ – ” రేవంత్ ను కలవడం వల్ల ప్రాధాన్యం ఏమిటి”…?

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇల్లెందులోనీ పలువురు బీఆర్ఎస్ నాయకులు కలవడం వల్ల తీవ్రంగా నియోజవర్గం వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా మరికొందరు షర్మిలకు టచ్ లు ఉండవు విశేషం. ఈ పరిణామాలపై రాజకీయ ఉత్కంఠ ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రెండు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రజల ఉత్కంఠకు తెరపడాలంటే మరో రెండు నెలలు వేచి చూడాల్సిన అవసరం ఉంది.