నువ్వేదో పొడుస్తావని నిన్ను గెలిపించలేదు: పొంగులేటి
== కష్టకాలంలో అండగా ఉంటానని అనుకున్నారు..కానీ నమ్మకాన్ని అమ్మెశావు
== డబ్బే.. రాజకీయాలలో ప్రాధాన్యం కాదు
== బెదిరించి పార్టీ మార్పిస్తే.. నీ వెంట ఉంటారా..?
== ఎమ్మెల్యే కందాళ పై మండిపడిన పొంగులేటి
(కూసుమంచి -విజయం న్యూస్)
నువ్వేదో పికుతావని , పొడుస్తావని కాదు..అండగా ఉంటానని, అందుకుంటావని, మావోడివని పాలేరు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే.. వాళ్ళు ఆశయాన్ని, వాళ్ళ ఆశను, వాళ్ళ లక్ష్యాన్ని బీఆర్ఎస్ పార్టీ దగ్గర కుదవబెట్టి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని పాలేరు నియోజకవర్గ ప్రజలు తరిమికొట్టాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి:-:పాలేరు ఎమ్మెల్యే ఆఫీస్ ఎదుట దళితుల ధర్నా
పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలోని ఓ పంక్షన్ లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నువ్వేదో పొడుస్తావని నిన్ను పాలేరు ప్రజలు ఎమ్మెల్యే గా గెలిపించలేదని ఆరోపించారు.అప్పనంగా వచ్చిన డబ్బులతో విర్రవీగాలని చూస్తున్నావు, నీ ఉడుత ఊపులకు ఎవరు భయపడని అన్నారు. ఎన్ని డబ్బులు సంచులు తెచ్చావని పాలేరు ప్రజలు నిన్ను గెలిపించారో గుర్తుకు తెచ్చుకో అని ప్రశ్నించారు.నీ అహంకారం, మదం పట్టిన మాటలు, అధికారం తో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేస్తా అనుకుంటున్నావ్, అది నీ వల్ల అవుతుందన్నారు. కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీ, కార్యకర్తలను బెదిరించి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. మీరు తీసుకెళ్ళిన కాంగ్రెస్ కార్యకర్తలు మీ వెంట ఉంటారా..? ఎన్ని రోజులు ఉంటారో కాపాడుకోవాలని, తల్లి ఇంటి నుంచి అలిగిపోయినంత మాత్రానా మీ ఇంటివాడు అవుతాడని అనుకోవడం మీ మూర్ఖత్వం అని అన్నారు.
ఇది కూడా చదవండి:- *నేడు నేలకొండపల్లిలో నిరుద్యోగ దీక్ష
మా బిడ్డలు మళ్లీ సొంత గూటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నయాని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రకటించిన 6గ్యారంటీలు పేదల ఇంటి ముందుకే వస్తాయని, కేసీఆర్ పాలన లా కాకుండా కచ్చితంగా అమలు చేస్తామని హామినిచ్చారు. మీ ముఖాలకు పరీక్షలు నిర్వహించలేని దుస్థితి లో ఉన్నారని ఆరోపించారు. కచ్చితంగా అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చిన కొద్ది రోజులకే అన్ని ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి, అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అంతే కాకుండా గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి:- కేటీఆర్ నోరు జాగ్రత్త: సీఎల్పీ నేత భట్టి