Telugu News

మీరు గర్వపడేలా  అభివృద్ది చేస్తా: మంత్రి పువ్వాడ

టీవీలు చూసుకుంటూ మాకేందుకులే అనుకోలేదు

0

మీరు గర్వపడేలా  అభివృద్ది చేస్తా: మంత్రి పువ్వాడ

== వరదలు వచ్చినప్పుడు మీతోనే ఉన్నా

== టీవీలు చూసుకుంటూ మాకేందుకులే అనుకోలేదు

== గొంతులోతు నీళ్లలో తిరిగి ప్రజలను కాపాడాం

== వరద అనంతరం ప్రతి ఇంటికి వచ్చిన

== 1718 గృహాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.8,463 చొప్పున పంపిణి చేశాం

== మున్నేరు బాధితులకు శాశ్వత పరిష్కారమే ఆర్సీసీ వాల్ నిర్మాణం

== నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.180 కోట్లు మంజూరు

== మున్నేరు వరద బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకున్నాం

== ముంపు ప్రాంతా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో, ముంపు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలందరు గర్వపడేలా అభివృద్ది చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామినిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలోని  ఖమ్మం నయా బజార్ ప్రభుత్వ పాఠశాల అవరణంలో ఏర్పాటు చేసిన సభలో బాధితులకు రూ.1.50 కోట్ల విలువైన నగదు చెక్కులను అర్హులైన 1,718 మంది కుటుంబాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ వరద వచ్చినప్పుడు అజయ్ అన్న మీ ఇంటికి వచ్చిండు.. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం అని చెప్పిన విధంగా మీకు అండగా నిలబడ్డానని అన్నారు. వరద వచ్చిపోయిన తెల్లారే మీ ఇళ్ల పరిసరాల్లో మున్సిపల్ కార్పొరేషన్ సహకారం తో శుభ్రం చేయించానని అన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసి:మంత్రి పువ్వాడ

అసలు వరద వచ్చిందా లేదా అన్న విధంగా శుభ్రం చేశామని తెలిపారు. అందరిలా వరదలు వస్తుంటే టీవీలు చూస్తు ఉండిపోలేదని, నా కుటుంబ  సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని అర్థరాత్రుల సైతం ముంపు ప్రాంతాల్లోనే ఉన్నానని మంత్రి పువ్వాడ గుర్తు చేశారు. ముంపు ప్రాంత ప్రజలందర్ని తప్పకుండా ఆదుకుంటున్నామని, అందరికి సమానంగా అర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు.  ఐటీసీ వారి సహకారంతో రూ.కోటి తో స్టీల్ సమన్లు ఇచ్చామని, గృహ అవసరాల కోసం వస్తువులు పంపిణి చేశామని తెలిపారు. నా విజ్ఞప్తి మేరకు ఎంపి బండి పార్థసారథి రెడ్డి రూ.కోటి, నా కోడలు అపర్ణ తాత కంపెనీ నుండి రూ.50 లక్షలు మొత్తం రూ.1.50 కోట్లు కలెక్టర్ అకౌంట్ కు బదాలయించడంతో ఆ డబ్బులతో నేడు ముంపుప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు, వస్తువులను పంపిణి చేస్తున్నామని అన్నారు. అడిగిన వెంటనే స్పందించిన బండి పార్థసారథి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  మున్నేరు వరదలో నేను పర్యటించిన క్రమంలో టీవీ లలో చూసిన నా కోడలు చలించి తన తాత కంపెనీ నుండి రూ.50 లక్షలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని,  నా కోడలు చిన్నది అయినప్పటికీ పేదల పట్ల పెద్ద మనసు చాటుకుందన్నారు.  మున్నేరు వరద ముంపు కుటుంబాలు 1,718 గృహాలకు ఒక్కో కుటుంబానికి రూ.8,463 వేలు అందరికీ సమానంగా పంపిణి చేస్తున్నామని తెలిపారు. మునుపెన్నడూ చూడని వరదలు మనం చూశాం.. రాత్రికి రాత్రి వరద తీవ్రత ప్రమాద స్థాయికి చేరుకుందన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఒక్క ప్రాణ నష్టం జరగలేదన్నారు.  వరద ముంపు లో చిక్కుకున్న వారికి బోట్ల ద్వారా కాపాడాలని కష్టపడినా ఫలితం లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్లి హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మంకు తీసుకొచ్చి నిర్విరామంగా కృషి చేసి అర్థరాత్రి 3 గంటల వరకు శ్రమించి ప్రతి ఒక్కరినీ కాపాడడం జరిగిందన్నారు.   పునరావాస కేంద్రాలు, మంచి భోజనంతో పాటు అన్ని వసతులు కల్పించామని తెలిపారు.

ఇది కూడా చదవండి: 14ఏళ్ల సీఎం..14 రోజుల జైలుకు చంద్రబాబు

మరుసటి రోజు ముంపు ప్రాంతాల్లో రోడ్లు, మురుగు, చెత్త తొలగించి మున్సిపల్ శాఖ అధ్వర్యంలో అన్ని వసతులు కల్పించిన. ముంపు బాధిత కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు పంపిణి చేశాం..అనంతరం జరిగిన క్యాబినెట్ సమావేశంలో మున్నేరు సమస్యను వివరించగా కేసీఅర్ కి వివరించగా ఎం చేద్దాం అని అడిగారన్నారు.  అందుకు ఆర్సీసీ రక్షణ గోడలు కడితే బావుంటుందని చెప్పగా సానుకూలంగా స్పందించిన కేసీఅర్ రూ .690 కోట్లు మంజూరు చేశారని, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశానని అన్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోని ముంపు బాధితులకు ఇక ఇబ్బందులు రావని,  మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం వేగంగా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. అతి త్వరలో ఆయా పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాం.. శాశ్వత పరిష్కారం కోసం రూ.777 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.  దీనితో పాటు వర్షపు నీరు కు ప్రత్యేక పైప్ లైన్, మురుగు నీరు కోసం ప్రత్యేక లైన్ లు ఎర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచిగా అభివృద్ది చేస్తామన్నారు.

మున్నేరు పై మారో మూడు చెక్ డ్యాంలు నిర్మిస్తాం. రూ.30 కోట్లతో పద్మావతి నగర్ రంగనాయకుల గుట్ట, ప్రకాష్ నగర్ చెక్ డ్యాం వద్ద మొత్తం మూడు చెక్ డ్యాం లు నిర్మాణం చేపట్టడానికి కేసీఅర్  మంజూరు చేశారు. త్వరలో దాని జీవో కూడా వస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు అర్థరాత్రి అరెస్ట్ తప్పిదమే: తుమ్మల

మున్నేరు పై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి పక్కనే మారో నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.180 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని తెలిపారు. ఖమ్మం ప్రజలను ఎప్పుడూ వదలలేదు.. మనకు ఇంత చేసిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. కేవలం దండాలు పెట్టీ వచ్చే వారిని తరిమికొట్టాలన్నారు. మొన్నటి వరకు బిక్కు బిక్కుమంటూ నివాసం ఉన్న మున్నేరు పరివాహక ప్రాంతం ప్రజలు రానున్న రోజుల్లో మున్నేరు ను చూసి గర్వపడేలా చేస్తామని తెలిపారు. దాన్ని పర్యాటక ప్రాంతం చేసి మీరు గర్వపడేలా చేస్తా.. రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత కేసీఅర్ ని కలిసి మున్నేరు సుందరీకరణ ప్రణాళికను వివరించి సుందరంగా తీర్చిదిద్దుతానని హామినిచ్చారు.  అనంతరం బాధిత కుటుంబాలకు ఆయా చెక్కులను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఆర్డీవో గణేష్, ఎంఆర్వో స్వామి, కార్పొరేటర్ లు కమర్తపు మురళి, మాటేటి లక్ష్మీనాగేశ్వరరావు, కన్నం వైష్ణవిప్రసన్న కృష్ణ, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.