Telugu News

షార్ట్ సర్క్యూట్తో యువ రైతు మృతి.

..... ఆధారం కోల్పోయిన కుటుంబ సభ్యులు

0

షార్ట్ సర్క్యూట్తో యువ రైతు మృతి
….. ఆధారం కోల్పోయిన కుటుంబ సభ్యులు

(చర్ల— విజయం న్యూస్);-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఆర్కొత్తగూడెం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం గ్రామానికి చెందిన గోడె.గణపతి మంగళవారం తెల్లవారుజామున తన వరి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళాడు.

also read :-నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేతనిషేధిత-

ఈ క్రమంలో మోటర్ చెడిపోవడంతో ఏమైందో చూడటానికి కి గోదావరి ఒడ్డున గల ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్ళాడు. చలికాలం కావడంతో ట్రాన్స్ఫార్మర్ పరిసరాలన్నీ మంచుతో కప్పబడి ఉండటం వల్ల అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగి గణపతి అక్కడికక్కడే మృతిచెందాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఆ కుటుంబానికి గణపతి ఒక్కడే ఆధారం. అతడి మృతితో ఆధారం కోల్పోయిన కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.